Telugu News Business BSNL Launches FREE Intranet TV for Mobile, National Wi Fi Roaming, and Fibre Based Intranet TV Services in Puducherry
BSNL: ఇక కేబుల్ టీవీతో పని లేదు.. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా 500+ ఉచిత ఛానల్స్.. మూడు కీలక సర్వీసులు!
BSNL: ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్లకు శుభవార్త చెప్పింది. ఎలాంటి కేబుల్ టీవీ అవసరం లేకుండా సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా ఏకంగా 500 కంటే ఎక్కువ హెచ్‌డీ టీవీ ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసులను ప్రారంభించింది..
Follow us on
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు మరింత అధునాతనమైన సేవలను అందించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త సేవలను ప్రారంభించింది. నియోగదారులకు మరింత కనెక్టివిటీ, వినోదం, అధునాతన టెక్నాలజీ అనుభవం అందించాలనే బీఎస్ఎన్‌ఎల్ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు కొత్త సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవలు బీఎస్‌ఎన్‌ఎల్ ఇంట్రానెట్ టీవీ (BiTV), జాతీయ Wi-Fi రోమింగ్ ఫెసిలిటీ, ఇంట్రానెట్ ఫైబర్ ఆధారిత టీవీ (IFTV). ఈ సేవలు పుదుచ్చేరి నుండి ప్రారంభిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ఇంట్రానెట్ టీవీ (BiTV): తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఇంట్రానెట్ టీవీ (BiTV) సేవను ప్రారంభించింది. పుదుచ్చేరిలోని మొబైల్ వినియోగదారులు ఇప్పుడు 300 లైవ్ టీవీ ఛానెల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ సేవను OTTplay భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇంట్రానెట్ ఆధారంగా పనిచేసే మంచి స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. జనవరి 2025 నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు విస్తరించి, త్వరలో దేశమంతా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. పాత PRBT సిస్టమ్‌లను ఈ కొత్త సేవలతో భర్తీ చేస్తూ, వినియోగదారులకు అత్యాధునిక వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఈ సేవ వినియోగదారులకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. వినియోగదారులు తమ ప్రస్తుత ప్లాన్‌తోనే Wi-Fi ను ఉపయోగించవచ్చు.
ఇంట్రానెట్ ఫైబర్ ఆధారిత టీవీ (IFTV): ఇక బీఎస్‌ఎన్‌ఎల్ ఇంట్రానెట్ ఫైబర్ ఆధారిత టీవీ (IFTV) సేవ అక్టోబర్ 2024లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సేవ పుదుచ్చేరి BSNL FTTH కస్టమర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది. దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 500లకుపైగా లైవ్ టీవీ ఛానెల్‌లను పొందవచ్చు. FTTH కస్టమర్లందరికీ ఈ సేవ ఉచితంగా అందిస్తోంది. ఈ సేవ BSNL కస్టమర్లకు మాత్రమే కాకుండా BSNL కాని వినియోగదారులకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. BSNL వినియోగదారులు తమ ప్రస్తుత ప్లాన్‌లతోనే Wi-Fi ను ఉపయోగించగలరు. BSNL కాని వినియోగదారులు UPI ద్వారా చెల్లించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
జాతీయ Wi-Fi రోమింగ్ ఫెసిలిటీ: గత ఏడాది అక్టోబర్‌లో తన జాతీయ Wi-Fi రోమింగ్ ఫెసిలిటీని కూడా ప్రారంభించింది. ఇది కూఆ పుదుచ్చేరిలోని మనడిపట్టు గ్రామం నుండి ప్రారంభించగా, త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇతర గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మూడు కీలక సేవలను ప్రవేశపెట్టి టెలికాం రంగంలో భారీ మార్పుకు దారితీస్తోంది.