BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మరో సూపర్‌ ప్లాన్‌.. తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీ

|

Jul 18, 2024 | 7:54 PM

ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ పెరిగింది. ప్రముఖ ప్రైవేట సంస్థలైన్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు భారీగా టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇతర టెలికాం సంస్థల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్‌ అవుతున్న విషయం తెలిసిందే...

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మరో సూపర్‌ ప్లాన్‌.. తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీ
Bsnl
Follow us on

ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ పెరిగింది. ప్రముఖ ప్రైవేట సంస్థలైన్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు భారీగా టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లను ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇతర టెలికాం సంస్థల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్‌ అవుతున్న విషయం తెలిసిందే. యూజర్లను మరింత అట్రాక్ట్‌ చేసే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో ఆసక్తికరమైన రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ. 139తో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రతీ రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. డేటా పూర్తయిన తర్వాత సెకనుకు 40 kbps వేగంతో డేటాను ఉపయోగించవచ్చు. మరే ఇతర టెలికాం రంగంలో ఇలాంటి రీఛార్జ్‌ ప్లాన్‌ లేదని చెప్పాలి.

ఇదిలా ఉంఏ దీంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 197 ప్లాన్‌ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. డేటా ఎక్కువగా కావాలనుకునే వారికి ఈ ప్లాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వీటితో పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరెన్నో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో కొన్ని బెస్ట్ ప్లాన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడాది ప్లాన్‌ కోసం చూస్తున్న వారికి బీఎస్‌ఎన్‌ఎల్ మంచి ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 2399తో రీఛార్జ్‌ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్ పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించి. 5జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి బీఎస్‌ఎన్‌ఎల్ ఇస్తున్న పోటీని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు ఎదుర్కోవడానికి ఎలా సిద్ధమవుతాయో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..