BSNL Plan: ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది..!

BSNL Plan: ఈ ప్లాన్ లో రోజుకు 2GB హై స్పీడ్ (4G) డేటా, భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్ అలాగే జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు వినియోగదారులు ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా పొందుతారు..

BSNL Plan: ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది..!

Updated on: Dec 05, 2025 | 8:03 PM

BSNL Plan: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన బిఎస్ఎన్ఎల్, వినియోగదారుల నుండి భారీ డిమాండ్ నేపథ్యంలో రూ. 1 ఫ్రీడమ్ ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది. ఇందులో ఉచిత కాల్స్, డేటాతో సహా అనేక ఆఫర్‌లను 30 రోజుల పాటు అందిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుండి ఫ్రీడమ్ ఆఫర్‌ను తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ వినియోగదారులు కేవలం రూ. 1కే నిజమైన డిజిటల్ స్వేచ్ఛను పొందుతారని తెలిపింది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

రూ. 1 రీఛార్జ్తో వినియోగదారులు రోజుకు 2GB హై స్పీడ్ (4G) డేటా, భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్ అలాగే జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు వినియోగదారులు ఈ ప్లాన్లో రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Kitchen Tip: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

BSNL ఆఫర్ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిల్‌లలో చెల్లుతుంది. వినియోగదారులు రూ.1కి కొత్త BSNL సిమ్ కార్డ్ కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త బీఎస్ఎన్ఎల్వినియోగదారులకు మాత్రమే అని కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో ధృవీకరించింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఈ రూ.1 ఆఫర్‌కు అర్హులు కారు.

100GB డేటాతో BSNL లెర్నింగ్ ప్లాన్:

లెర్నర్స్ ప్లాన్ అని కూడా పిలిచే ఇది కేవలం రూ. 251కే విద్యార్థులకు 100GB డేటా, 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా వారు ప్రతిరోజూ 100 SMS సందేశాలను అందుకుంటారు. ఈ ఆఫర్ డిసెంబర్ 13, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. రూ.15 వేల డిపాజిట్‌తో చేతికి రూ.25 లక్షలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి