Jio vs BSNL Offers: టెలికాం రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కంపెనీలపై పైచేయి సాధించేందుకు ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ పోటీ ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్, విఐ మధ్య కనిపిస్తుంటుంది. అయితే, వీటిని ధీటుగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్‌ఎల్ కూడా నిలుస్తోంది. అందులో భాగంగానే సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటుంది.
రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ రెండూ తమ వినియోగదారుల కోసం 90 రోజుల 4 జి ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ తన 90 రోజుల ప్రణాళికను చాలా కాలంగా అందిస్తుండగా, ఈ ప్లాన్‌ను జియో కొత్తగా ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో 15, 30, 60, 90, 365 రోజుల చెల్లుబాటుతో కొత్త ప్లాన్‌లను ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ 90 రోజుల 4 జి ప్లాన్.. జియో అందించే ప్లా్న్ ధర కంటే కూడా చాలా తక్కువ.
రిలయన్స్ జియో 90 రోజుల ప్లాన్ ధర రూ .597 ఉండగా.. బిఎస్ఎన్ఎల్ 90 రోజుల ప్లాన్ రూ. 499 లకు వస్తుంది. ఇక ప్రయోజనాల పరంగా చూసుకుంటే.. బిఎస్ఎన్ఎల్, జియో ప్లాన్స్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
బిఎస్‌ఎన్‌ఎల్ 90 రోజుల 4 జి ప్రీపెయిడ్ ప్లాన్..
పైన చెప్పినట్లుగా, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 90 రోజుల 4 జి ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ .499 కు అందిస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు 2 జిబి రోజువారీ డేటాను పొందుతారు. అంటే వినియోగదారులు మొత్తం 180 జిబి డేటాను పొందుతారు. దాంతో అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తున్నారు. అలాగే కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు.
రిలయన్స్ జియో 90 డేస్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్..
రిలయన్స్ జియో 90 రోజుల 4 జి ప్రీపెయిడ్ ప్లాన్‌ను 597 రూపాయలకు అందిస్తుంది. ఇది ప్లాన్‌ను జియో కొత్తగా ప్రారంభించింది. ఇది వినియోగదారులకు రోజువారీ డేటా వినియోగ పరిమితి లేకుండా 75జీబీ ఫెయిర్-యూజ్-పాలసీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు మొత్తం 75 జీబీని వినియోగించవచ్చు. ఒక రోజులో లేదా, 90 రోజుల వ్యవధిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఇస్తుంది. అలాగే.. జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సహా ఇతర జియో యాప్స్ యాక్సెస్ ఇస్తోంది.
ఈ రెండింటినీ బేరీజు వేస్తే.. జియో ప్లాన్ కన్నా బిఎస్ఎన్‌ఎల్ ఉత్తమంగా కనిపిస్తుంది. చౌక ధరకే లభించడమే కాకుండా.. వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తోంది.
Also read:
Accident: రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్.. పలువురికి గాయాలు..