
BSNL Bharat Fibre Plans 2025: భారతదేశంలోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సేవలలో బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ ఒకటి. దేశంలోని ఇళ్ళు, కార్యాలయాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే బిఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయమైన ప్రయోజనాలు, ఒక సంవత్సరం చెల్లుబాటుతో తన ఫైబర్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో చాలా వరకు ఒక నెల ఉచిత సర్వీస్‌ను అందిస్తాయి. ఇప్పుడు చాలా తక్కువ ధర ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏవి ముఖ్యమైనవో చూద్దాం.
ఇది కూడా చదవండి: Multibagger Stock: లక్ష రూపాయల స్టాక్ ఐదేళ్లలో రూ.1.84 కోట్లుగా మార్చింది..!
గ్రామీణ FTTH వాయిస్ అన్‌లిమిటెడ్:
ఈ ప్లాన్ సంవత్సరానికి రూ.2,988 ఖర్చవుతుంది. మీరు మొదటి 10GB కి 25Mbps వేగం పొందుతారు. ఆ తర్వాత వేగం 2Mbps కి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ లో అపరిమిత డేటా డౌన్‌లోడ్, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ ఉంటాయి.
FTTH వాయిస్ అన్‌లిమిటెడ్:
దీని ధర సంవత్సరానికి రూ.3,588. మొదటి 20GB కి మీకు 25Mbps వేగం లభిస్తుంది. తరువాత అది 2Mbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా, కాల్స్ కూడా ఉన్నాయి.
ఉత్తమ డేటా పరిమితులు కలిగిన ప్లాన్‌లు:
ఫైబర్ గ్రామీణ గృహ Wi-Fi
గ్రామీణ వినియోగదారులకు వార్షిక రేటు రూ.4,788. ఇది మొదటి 1.4TB (టెరాబైట్స్) వరకు 40Mbps వేగాన్ని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4Mbpsకి తగ్గిపోతుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత డేటా డౌన్‌లోడ్, ఉచిత కాల్‌లను కూడా అందిస్తుంది.
ఫైబర్ బేసిక్ నియో:
5,388 రూపాయల ధర కలిగిన ఈ ప్లాన్ మొదటి 3.3TB వరకు 50Mbps వేగాన్ని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4Mbpsకి తగ్గించబడుతుంది. అన్ని ప్లాన్‌లు అపరిమిత డేటా డౌన్‌లోడ్ (FUP పరిమితితో), బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, STD కాల్‌లను ఉచితంగా అందిస్తాయి. అంతర్జాతీయ కాల్స్ (ISD) రూ.1.20 వసూలు చేస్తారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: బంగారం ధర పైపైకి.. రూ. 2 లక్షలకు చేరువలో వెండి ధర..!
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి