మీరు కొనేది అసలు బంగారమా? కాకి బంగారమా? వీడియో
బంగారం కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్క్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. BIS నిబంధనల ప్రకారం, 18 క్యారెట్ల బంగారానికి కూడా హాల్‌మార్క్ తప్పనిసరి. హాల్‌మార్క్ లేని బంగారాన్ని కొంటే స్వచ్ఛతపై అనుమానం, రంగు మారడం, అమ్మేటప్పుడు తక్కువ ధర వచ్చే ప్రమాదం ఉంది. మోసపోకుండా జాగ్రత్త పడండి.
బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అత్యవసరం అని నిపుణులు చెబుతున్నారు. మీరు కొనే బంగారానికి, ముఖ్యంగా 18 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఉంటుందా అనే సందేహం చాలామందికి వస్తుంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఉండొచ్చు, కానీ 18 క్యారెట్ల బంగారం విషయంలో తప్పుడు సమాచారం ఇస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. నిజానికి, BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనల ప్రకారం, 18 క్యారెట్ల బంగారానికి సైతం హాల్‌మార్క్ తప్పనిసరి. వస్తువుపై ఆ ముద్ర లేకపోతే అనుమానించాల్సిందే. దానిని కొనకపోవడమే మంచిది. కొన్ని జ్యువెలరీ షాపుల్లో, ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ వంటి ప్రాంతాలలో, 18 క్యారెట్ల బంగారానికి హాల్‌మార్క్ ఉండదని నమ్మబలికి కస్టమర్లను మోసం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి వీడియో
బ్యాంకునుంచి నగదు డ్రా చేస్తున్నారా..జాగ్రత్త వీడియో
ఉగ్ర ముఠా టార్గెట్ అవేనా? వీడియో
ఈ పెట్టె వెనుక పెద్ద చరిత్రే ఉంది.. దొంగలూ ఎత్తుకెళ్లలేరు వీడియో
విషాదం..కొన్ని గంటల్లో తాళి కట్టాల్సిన వరుడు.. అంతలోనే వీడియో
కార్మికుడి అకౌంట్లో రూ. 77 లక్షలు.. ఏం జరిగిందంటే వీడియో
ముంబైని హడలెత్తిస్తున్న చిరుతలు .. వీడియో వైరల్
