మీ పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు జీరో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. బ్రో(బీఆర్ఓ) సేవింగ్స్ అకౌంట్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కేవలం విద్యార్థుల కోసమే రూపొందించిన అకౌంట్. 16ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఈ బ్రో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిలో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కాంప్లిమెంటరీగా జీవితకాలం వ్యాలిడిటీతో డెబిట్ కార్డు ఇస్తారు. ఇంకా ఈ ప్రత్యేకమైన జీరో అకౌంట్ ఖాతాకు సంబంధించిన ఫీచర్లు, ఖాతా ప్రారంభించే విధానం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సందర్బంగా బ్యాంక్ రిటైల్ లియబిలిటీస్ అండ్ ఎన్ఆర్ఐ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ బీఓబీ బ్రో సేవింగ్స్ అకౌంట్ యువకులను బ్యాంకింగ్ ప్రపంచానికి పరిచయం చేస్తుందన్నారు. ఇది వారి నిర్దిష్ట బ్యాంకింగ్ అవసరాలను జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పారు. అత్యంత విలువైన ఫీచర్లు, ప్రయోజనాలను అందిస్తుందని వివరించారు. వతను ఆకర్షించడానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక బ్యాంకింగ్ భాగస్వామిగా ఐఐటీ బాంబే, వార్షిక విద్యార్థి ఉత్సవం, ఆసియాలో అతిపెద్ద కళాశాల సాంస్కృతిక ఉత్సవం అయిన మూడ్ ఇండిగో (మూడి)తో జతకట్టింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న ల్యాండ్‌స్కేప్‌లో, బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త తరం కస్టమర్‌లకు సంబంధితంగా, అర్థవంతంగా ఉండేలా అభివృద్ధి చెందుతూ, రూపాంతరం చెందుతూనే ఉందన్నారు. వినియోగదారులతో శాశ్వత సంబంధాలను నిర్మించుకోవడానికి తాము దీర్ఘకాలిక విధానాన్ని తీసుకుంటున్నామన్నారు. మూడ్ ఇండిగోతో మా అనుబంధం ఈ ఫిలాసఫీకి అనుగుణంగా ఉందని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..