Bitcoin – Bill Gates: బిట్‌కాయిన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిల్‌గేట్స్.. దానికీ ఓ బలమైన కారణముందండోయ్.. అదేంటంటే..

|

Jun 16, 2022 | 5:45 AM

Bitcoin - Bill Gates: బిట్‌కాయిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు అపర కుబేరుడు బిల్‌గేట్స్. క్రిప్టోకరెన్సీ అంతా బూటకమని, ఇది గ్రేట్ ఫూల్ థియరీ అంటూ వ్యాఖ్యానించారు.

Bitcoin - Bill Gates: బిట్‌కాయిన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిల్‌గేట్స్.. దానికీ ఓ బలమైన కారణముందండోయ్.. అదేంటంటే..
Bill Gates
Follow us on

Bitcoin – Bill Gates: బిట్‌కాయిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు అపర కుబేరుడు బిల్‌గేట్స్. క్రిప్టోకరెన్సీ అంతా బూటకమని, ఇది గ్రేట్ ఫూల్ థియరీ అంటూ వ్యాఖ్యానించారు. మరి ఆయన ఈ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా బిట్‌కాయిన్‌ 18 నెలల కనిష్టానికి పడిపోయింది. 7.8% తగ్గి 20,289 డాలర్లకు చేరింది ఈ సంవత్సరం బిట్‌కాయిన్‌ విలువ సగం మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అమెరికా ఆర్థిక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదల క్రిప్టోకరెన్సీల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఏమిటి అనే చర్చ జరుగుతున్న సమయంలో ప్రపంచ బిలియనీర్‌ బిల్‌గేట్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్‌ కాయిన్‌ నిన్న 15 శాతం, ఇవాళ ఐదున్నర శాతం పతనమైంది. క్రిప్టోకరెన్సీ ఆధారిత ప్రాజెక్టులు- అత్యంత మూర్ఖపు సిద్ధాంతపు పునాదుల మీద ఉన్నాయని బిల్‌గేట్స్‌ తప్పుబట్టారు. అసలు క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టులే పెద్ద బూటకమని ఆయన అన్నారు. ఇదంతా గ్రేటర్-ఫూల్ థియరీ అని ఎద్దేవా చేశారు. కోతి బొమ్మలున్న ఈ క్రిప్టో కరెన్సీలు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాయట అంటూ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు బిల్‌గేట్స్‌.

ఇవి కూడా చదవండి

కాలిఫోర్నియా బార్‌క్లేలోని టెక్ క్రంచ్ నిర్వహించిన కార్యక్రమంలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు చాలా రిస్క్ అని చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీని సమర్ధించే టెస్లా CEO ఎలోన్ మస్క్‌తో గతంలోనే బిల్‌గేట్స్‌ తీవ్రంగా విభేదించారు. క్రిప్టో నాణేల తవ్వకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి మస్క్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. డిజిటల్ ఆస్తుల మీద తనకు నమ్మకం లేదని, ఇందులో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోనని తెలిపారు బిల్‌గేట్స్‌.