ఆదాయపు పన్ను చెల్లించేవారందరూ ప్రతి ఏటా ఆదాయపు పన్ను రిటర్స్స్ (ఐటీఆర్) సమర్పించాలి. ఆ ఆర్థిక సంవత్సరంలో వారి సంపాదన, ఖర్చులు తదితర వివరాలన్నీ దానిలో ఉంటాయి. వాటిని పరిశీలించిన అనంతరం ఎంత పన్ను చెల్లించాలో ఆ శాఖ అధికారులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారుడికి కొన్ని రాయితీలు అందిస్తాయి. వాటిలో 80 సీ కింద పలు తగ్గింపులు ఉంటాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతో పాటు హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్ యూఎఫ్ లు) కొన్ని పెట్టుబడులు, ఖర్చులను దీని ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చెల్లింపులో పాత, కొత్త విధానాలు అనే రెండు రకాలు ఉన్నాయి. వీటిలోని పాత విధానంలో 80 సీ సెక్షన్ మినహాయింపులు ఎక్కువగా ఉంటాయి. దీనికింద పెట్టే పెట్టుబడులకు రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. చాన్నాళ్లుగా ఈ పరిమితి పెరగనందున ఈసారి తప్పకుండా పెంచుతారని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.
ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద కొన్ని రకాల పెట్టుబడులు, ఖర్చులకు మినహాయింపులు లభిస్తాయి.
ఆదాయపు పన్ను రిటర్స్స్ దాఖలు చేసినప్పుడు మన ఆదాయం వివరాలతో పాటు పైన తెలిపిన పెట్టుబడులు, ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ శాఖ అధికారుల పరిశీలన అనంతరం నిబంధనల మేరకు పన్ను చెల్లింపుదారుడికి రాయితీలు వర్తింపజేస్తారు. 80 సీ సెక్షన్ కింద మినహాయింపు పరిధి 2014 నుంచి రూ.1.50 లక్షలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెరిగిన జీవన వ్యయం, ఖర్చులు తదితర వాటికి అనుగుణంగా మినహాయింపును పెంచే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి