Bgauss RUV 350: ఈవీ మార్కెట్‌లో బిగాస్ బిగ్‌స్టెప్.. మెంటలెక్కే ఫీచర్లతో నయా ఈవీ లాంచ్

|

Jun 28, 2024 | 3:38 PM

మొదట్లో పట్టణ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్న ఈవీ స్కూటర్లు క్రమేపి గ్రామీణులు కూడా వాడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు భారతీయ మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిగాస్ తన సరికొత్త ఈవీ బిగాస్ ఆర్‌యూవీ 350ని విడుదల చేసింది.

Bgauss RUV 350: ఈవీ మార్కెట్‌లో బిగాస్ బిగ్‌స్టెప్.. మెంటలెక్కే ఫీచర్లతో నయా ఈవీ లాంచ్
Bgauss Ruv 350
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ఎక్కువగా భారతీయులు ఇష్టపడుతున్నారు. మొదట్లో పట్టణ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్న ఈవీ స్కూటర్లు క్రమేపి గ్రామీణులు కూడా వాడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు భారతీయ మార్కెట్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిగాస్ తన సరికొత్త ఈవీ బిగాస్ ఆర్‌యూవీ 350ని విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసిన బిగాస్ ఆర్‌యూవీ 350 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆర్‌యూవీ 350ఈఎక్స్ఐ, ఆర్‌యూవీ 350 ఈఎక్స్, ఆర్‌యూవీ 350 మాక్స్. బిగాస్ ఆర్‌యూవీ 350 బేస్ మోడల్‌కి ధరలు రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్-స్పెక్ వేరియంట్‌కి రూ. 1.35 లక్షల వరకు ఉంటాయి. భారతదేశం అంతటా 120 డీలర్‌షిప్‌ల బిగాస్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి. బిగాస్ ఆర్‌యూవీ 350 3.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా 165 ఎన్ఎం టార్క్, 75 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఈ స్కూటర్ 3 కేడబ్ల్యూహెచ్ లిథియం ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పనిచేస్తుంది. టాప్ స్పెక్ మోడల్ ఒకే ఛార్జ్‌పై 120 కిమీల పరిధిని అందిస్తుంది. అయితే ఆర్‌యూవీ ఈఎక్స్ఐ, ఆర్‌యూవీ 350 ఈఎక్స్ వేరియంట్‌లు 90 కిమీల పరిధిని అందిస్తాయి.

బిగాస్ ఆర్‌యూవీ 350 ఈ-స్కూటర్ మైక్రో-అల్లాయ్ ట్యూబులర్ ఫ్రేమ్‌పై నిర్మించారు. అలాగే ఈ స్కూటర్ సస్పెన్షన్ విధులను ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌ల ద్వారా నిర్వహిస్తుంది. అలాగే రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఈ స్కూటర్ ప్రత్యేకత. బిగాస్ ఆర్‌యూవీ 350 ఈఎక్స్, మ్యాక్స్ మోడల్‌లు 5 అంగుళాల స్మార్ట్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఫాల్ డిటెక్షన్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లతో సహా అధునాతన ఫీచర్‌లతో ఆకట్టుకుంటున్నాయి. బిగాస్ ఆర్‌యూవీ 350 విడుదలతో దాని బిగాస్ కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి