ప్రతీ మనిషి తాను సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అందుకోసమే ఎంత కష్టమైనా ఖర్చులను తగ్గించుకొని మరీ పొదుపు చేస్తుంటారు. అయితే పొదుపు చేసిన ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో భాగంగా సెక్యూరిటీతో పాటు, మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు.
ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌లో ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్‌పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ క్రమంలోనే గత ఏప్రిలోలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1, 2023న పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు.
ఈ పథకంలో భాగంగా కస్టమర్లు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, 5 ఏళ్లు పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఒక ఏడాదిపాటు పెట్టుబడి పెడితే 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. లేదా 2 నుంచి మూడేళ్లు పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ పొందొచ్చు. ఇకపోతే ఒకవేళ 5 ఏళ్లు పెట్టుడితే గరిష్టంగా 7.5 శాతం వడ్డీని పొందొచ్చు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావాలంటే కస్టమర్లు ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. అతనికి ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే డిపాజిట్‌పై రూ. 2,24,974 వడ్డీని పొందొచ్చు. పెట్టిన పెట్టుబడితో కలిపితే ఈ మొత్తం.. రూ. 7,24,974కి చేరుతుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద కస్టమర్లు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందులో సింగిల్ ఖాతా లేదా, జాయింట్ ఖాతా ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లల ఖాతాను అతని కుటుంబ సభ్యులు ఓపెన్ చేయొచ్చు. ఇందుకోసం రూ. 1000తో ఖాతా తెరవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..