వ్యాపారం ఏదైనా కూడా మనం స్టార్ట్ చేసి.. కొద్దిరోజులు ఆగితే అద్భుతమైన లాభాలు సంపాదించవచ్చు. ఇక బిజినెస్ అన్నాక ఓసారి లాభం రావడం.. మరోసారి లాస్ అవ్వడం ఖాయం. అన్ని సీజన్లు ఒకేలా ఉండవు కాబట్టి.. మీకోసం ఓ మాంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. అన్ని సీజన్లలోనూ చేసుకునే ఈ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 10 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు.. మాంచి లాభాలు మీ సొంతం అవుతాయి. మన దేశంలో అందరికీ భోజనంలో కచ్చితంగా ఊరగాయ ఉండాల్సిందే. అందుకే పలు రకాల పచ్చళ్లు, చట్నీలు తయారు చేస్తుంటారు. ఇక చాలామంది ఊరగాయ తినడానికి బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పచ్చళ్ల బిజినెస్ మొదలుపెడితే.. అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే. అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్, వ్యాపారాన్ని విస్తరించేందుకు అవసరమయ్యే మాంచి మార్కెటింగ్ ఐడియాస్.
ప్రస్తుత వేసవి సీజన్లో మామిడి, నిమ్మకాయ, టమాటా, ఉసిరికాయ వంటి అనేక రకాల పచ్చళ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక ఈ ఊరగాయలు తయారు చేయడానికి, ఎండబెట్టడానికి, పచ్చళ్లు ప్యాకింగ్ చేయడానికి మనకు కొంచెం ఖాళీ స్థలం అవసరం. ఇక పచ్చళ్లు ఎక్కువ కాలం ఉండేలా.. చెడిపోకుండా చూసుకునేందుకు పరిశుభ్రత అత్యవసరం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఆన్‌లైన్ విధానం ద్వారా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ(FSSAI) నుంచి లైసెన్స్ పొందాలి. కాగా, ప్రస్తుతం ఉన్న పచ్చళ్ల ధరల ఆధారంగా చూసుకుంటే.. ప్రతీ పచ్చడి ప్యాకెట్‌పై రూ. 30 నుంచి రూ. 40 వరకు లాభం పొందొచ్చు. ఆ పరంగా చూసుకుంటే రెండు వేల ప్యాకెట్లకు.. రూ. 60 వేల వరకు సంపాదించే ఛాన్స్ ఉంది. క్రమం తప్పకుండా హోల్‌సేల్ షాపులకు కూడా మీ పచ్చళ్ల ప్యాకెట్లు అమ్మితే మరిన్ని లాభాలు పొందొచ్చు. అలాగే డిమాండ్ బట్టి విదేశాలకు మీ పచ్చళ్లు ఎగుమతి చేయవచ్చు.
ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..