మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకులే. అయితే వాటి ధర కాస్త అధికంగా ఉండటంతో సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీదారు ఏథర్ కూడా దీనిపైనే అధిక ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏథర్ 450ఎక్స్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ను అతి తక్కువ ధరకే లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
అయితే ఏథర్ కంపెనీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. రీవీల్ అయిన ఈ సమాచారంపై కూడా కంపెనీ ఏ విధంగానూ స్పందించలేదు. అయితే ఏథర్ కంపెనీ 2023 మార్చిలోనే 450ఎస్ స్కూటర్ కోసం ట్రేడ్ మార్క్ దరఖాస్తును సమర్పించినట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది దరఖాస్తు అప్రూవ్ అయినట్లు తెలుస్తోంది. అదనంగా 450ఎస్ లోగోనూ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడో వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ ఈ స్కూటర్ అతి తక్కువ ధరకే లాంచ్ అయితే దీనిలో అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉండే అవకాశం తక్కువ. ప్రస్తుతం ఉన్న ఏథర్ 450ఎక్స్ కన్నా తక్కువ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ధర తగ్గించే పక్షంలో ప్రస్తుతం ఉన్న 450ఎక్స్ ప్రో వేరియంట్లలో కూడా కొన్ని టాప్ ఫీచర్లను తొలిగించే అవకాశం ఉంది. 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, రైడింగ్ మోడ్లు, ఆటో హోల్డ్, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు వచ్చే తక్కువ ధర వేరింయట్లో ఉండయపోవచ్చు.
కొన్ని రిపోర్టుల ప్రకారం.. కొత్తగా రానున్న ఏథర్ 450 ఎక్స్ వేరియంట్ స్కూటర్ స్పెసిఫికేషన్లు మాత్రం ఏమి మారకపోవచ్చని తెలుస్తోంది. బ్యాటరీ ప్యాక్ అలాగే ఉంటుంది. మోటార్ గరిష్టంగా 8బీహెచ్పీ, 26ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ రేంజ్ కూడా 146 కిలోమీటర్లు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..