House Buying: మహిళల పేరు మీద ఇల్లు కొంటే రూ.6 లక్షలు ఆదా.. ఎలా అంటే?

|

Mar 01, 2024 | 5:30 AM

ఇల్లు కొనుగోలు చేయడంతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ఖర్చు.. స్టాంప్ డ్యూటీ. మీరు ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు దీనిని చెల్లించాలి.అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు తమ పేరుతో ఇల్లు కొనుగోలు చేస్తే.. వారికి స్టాంప్ డ్యూటీ రాయితీని ఇస్తాయి. వారు ఆస్తికి ఉమ్మడి యజమానులుగా ఉన్నప్పుడూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఉదాహరణకి: ఢిల్లీలో, ఇంటి కొనుగోలుదారులకు మహిళలయితే ఆస్తి విలువలో వారికి స్టాంప్ డ్యూటీ..

House Buying: మహిళల పేరు మీద ఇల్లు కొంటే రూ.6 లక్షలు ఆదా.. ఎలా అంటే?
New House
Follow us on

రియల్ ఎస్టేట్‌లో మహిళల పెట్టుబడిని ప్రోత్సహించడానికి, అనేక బ్యాంకులు. NBFCలు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ను ఇస్తాయి. మహిళలు సాధారణంగా పురుషులతో పోలిస్తే వడ్డీ రేటుపై 5 నుండి 10 బేసిస్ పాయింట్లు (0.05 నుండి 0.10%) తగ్గింపు పొందుతారు. ఇది బ్యాంకుల వారీగా మారుతుంది. క్రెడిట్ స్కోర్‌పైనా ఆధారపడి ఉంటుంది. అయితే చిన్న తగ్గింపు కూడా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేస్తుందని మర్చిపోకూడదు. సిద్ధార్థ్ తన పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుంటే, దానికి ప్రారంభ వడ్డీ రేటు  9.15%. కానీ SBI.. మహిళలకు 0.05 శాతం మినహాయింపు ఇస్తుంది. మహిళలకు వడ్డీ రేట్లు 9.10 శాతం నుండి ప్రారంభమవుతాయి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గృహ లక్ష్మి పథకంలో మహిళలకు గృహ రుణ వడ్డీ రేటు 8.35% నుండి 9.25%. ఇతరులకు 8.5% నుండి 9.5% వరకు ఉంటుంది.

ఉదాహరణకు, సిద్ధార్థ్ సెంట్రల్ బ్యాంక్ నుండి తన పేరు మీద 1 కోటి రూపాయల రుణం తీసుకుంటే, అతని EMI 93,213 రూపాయలు అవుతుంది. అతను 20 సంవత్సరాలలో 1.23 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించాలి.అతను తన భార్య పేరు మీద రుణం తీసుకుంటే, వడ్డీ రేటు 9.10%కి పడిపోతుంది, అతని EMI 91,587 రూపాయలు. అతను 1.19 కోట్ల వడ్డీని చెల్లిస్తాడు. అతను EMIలో నెలకు దాదాపు 2,000 రూపాయలు ఆదా చేయగలడు. అతను 20 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల రూపాయల వడ్డీని కూడా సేవ్ చేస్తాడు.గృహ రుణం తీసుకునే ముందు, మహిళ పేరు మీద ఉన్న రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు గురించి బ్యాంక్‌ని అడగండి. మహిళ కూడా సంయుక్తంగా రుణాన్ని తీసుకుంటే.. బ్యాంకులు కూడా తగ్గింపు ఇస్తాయి. మీ భార్య సహ-రుణగ్రహీతగా ఉండటం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే మీ ఆదాయాలను కలపడం వలన మీ లోన్ అర్హత పెరుగుతుంది, మీ కలల ఇంటి కోసం మరింత రుణం తీసుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది.

ఇల్లు కొనుగోలు చేయడంతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ఖర్చు.. స్టాంప్ డ్యూటీ. మీరు ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు దీనిని చెల్లించాలి.అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు తమ పేరుతో ఇల్లు కొనుగోలు చేస్తే.. వారికి స్టాంప్ డ్యూటీ రాయితీని ఇస్తాయి. వారు ఆస్తికి ఉమ్మడి యజమానులుగా ఉన్నప్పుడూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఉదాహరణకి: ఢిల్లీలో, ఇంటి కొనుగోలుదారులకు మహిళలయితే ఆస్తి విలువలో వారికి స్టాంప్ డ్యూటీ 4%, పురుషులకు6%. అదేవిధంగా, హర్యానాలో, పురుషులకు స్టాంప్ డ్యూటీ 7%, మహిళలకు 5%. సిద్ధార్థ్ ఢిల్లీలో రూ.1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తున్నాడనుకుందాం. పురుషుడిగా అతను రూ. 6 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. అయితే, అతను తన భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే, అతను స్టాంప్ డ్యూటీగా కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాలి. అతను  రూ.2 లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. గృహ రుణం మీ స్వంత ఇంటి కలను సాకారం చేయడంలో సహాయపడటమే కాకుండా మీరు పన్నులను కూడా ఆదా చేస్తుంది

ఇవి కూడా చదవండి

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, మీరు గృహ రుణం ప్రిన్సిపుల్ రీపేమెంట్ పై రూ.1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, సెక్షన్ 24(బి) ప్రకారం హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు తగ్గింపు ఉంది.ఈ మొత్తాలు మీ ఆదాయం నుండి కట్ అవుతాయి. దీనివల్ల మీరు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గుతుంది. మహిళలను ఇంటి యాజమానులుగా చేయడానికి, భారత ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించింది. వీటి ద్వారా మహిళలు వడ్డీ రాయితీలను కూడా పొందుతారు.వీటిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఒకటి. CLSS అనే పేరుతో పిలిచే.. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్  ఆప్షన్ దీనికి ఉంది.

ఈ పథకం కింద, ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు (LIG), మధ్య ఆదాయ వర్గాలు (MIG) సబ్సిడీలు పొందుతారు. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి రుణం తీసుకునే అలాంటి వ్యక్తులు 2.67 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీని పొందవచ్చు. మగవారితో పోలిస్తే.. మహిళలకు కలిగే రెండు అదనపు ప్రయోజనాలు ఏమిటంటే.. వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీ రాయితీలు. హోమ్ లోన్ అసలు, వడ్డీపై పన్ను మినహాయింపులు.. వడ్డీ రాయితీలు వంటి ప్రయోజనాలు.. మగవారు, మహిళలు.. ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి.సిద్ధార్థ్ తన భార్య పేరు మీద ఇల్లు కొంటే, అతను దాదాపు రూ.6 లక్షల రూపాయలు సేవ్ చేయవచ్చు.

సిద్ధార్థ్ లాగా, మీరు కూడా మీ భార్య లేదా తల్లి పేరు మీద ఇల్లు కొనడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో బ్యాంకులు, బిల్డర్లు మహిళల కోసం ప్రత్యేక డీల్స్ ను కూడా అందిస్తాయి. మీరు ఈ ఆఫర్‌ల గురించి కూడా తెలుసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి