EV Scooters: మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరలో అదిరే మైలేజ్

భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ బాగా నడుస్తుంది. ముఖ్యంగా టూవీలర్ మార్కెట్‌లో ఈ జోష్ భారీగా ఉంది. అయితే ఎక్కువ మంది ప్రజలు ఈవీ బైక్‌ల కంటే ఈవీ స్కూటర్లనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మరో కంపెనీ తక్కువ ధరతో నయా ఈవీను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

EV Scooters: మార్కెట్‌లోకి నయా ఈవీ స్కూటర్ లాంచ్.. తక్కువ ధరలో అదిరే మైలేజ్
Battre Loev

Updated on: Feb 19, 2025 | 3:18 PM

ప్రముఖ కంపెనీ బ్యాట్ఆర్ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఎల్ఓఈవీ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్కూటర్ ధర రూ.69,999గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధీకృత డీలర్ల వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి బ్యాట్ ఆర్ఈ ఎల్ఓఈవీ ప్లస్  స్కూటర్ మూడు రైడింగ్ మోడ్‌లతో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో గంటకు 35 కిమీదూసుకు పోతే కంఫర్ట్ మోడ్ 48 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. అయితే స్పోర్ట్స్ మోడ్‌లో మాత్రం సాధారణ స్కూటర్లలా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో వెళ్లవచ్చు. స్కూటర్‌కు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ స్పీడోమీటర్ ఆకట్టుకుంటుంది. 

బ్యాట్ ఆర్ఈ ఎల్ఓఈవీ ప్లస్  అమరాన్ బ్యాటరీతో వస్తుంది. 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో, 13 ఏఎంపీ ఛార్జర్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు. అలాగే బ్యాటరీ, ఛార్జర్ రెండూ ఐపీ 67 రేటింగ్‌తో వస్తుంది. ప్రీమియం బ్యాటరీ 21700 సెల్స్‌ను ఉపయోగిచడం వల్ల  దీర్ఘకాలిక పనితీరుతో వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. ఈ బ్యాటరీను కేవలం 2 గంటల 30 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు. అలాగే బ్యాటరీ, ఛార్జర్ రెండింటి పై 3 సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తుంది. బ్యాట్ ఆర్ఈ ఎల్ఓఈవీ ప్లస్ క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడీ ల్యాంప్స్ హిల్ హెల్డ్ అసిస్ట్, సీఏఎన్ -ఎనేబుల్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి లక్షణాలతో వస్తుంది. పార్కింగ్ మోడ్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, కంబైన్డ్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, శారీ గార్డ్ వంటి ఫీచర్లతో వస్తుంది. 

బ్యాట్ ఆర్ఈ ఎల్ఓఈవీ ప్లస్ స్కూటర్ 180 మి.మి గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది.  బ్యాట్ ఆర్ఈ ఎల్ఓఈవీ ప్లస్ ఐదు రంగులతో అందుబాటులో ఉంటుంది. స్టార్ట్ బ్లూ, స్టార్మీ గ్రే, ఐస్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్, పెర్ల్ వైట్ కలర్స్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంటాయి. అమరాన్ అందించే అధునాతన బ్యాటరీతో నడిచే అత్యంత ఫీచర్లతో కూడిన తమ స్కూటర్ ఆకట్టుకుంటుంది. బ్యాట్ ఆర్ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ నిశ్చల్ చౌదరి పేర్కొన్నారు. ఈ స్కూటర్ పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశామని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి