భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. టాప్ కంపెనీలతో పాటు స్టారప్ కంపెనీలు కూడా కొత్త మోడ్సల్ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కేవలం ఫీచర్ల విషయంలోనే పోటీ పడిన కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకోడానికి ప్రస్తుతం రేట్ విషయంలో కొత్తగా పోటీను మొదలుపెట్టాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో ఓలా తన మార్క్‌ను చూపించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఓలా స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిగిలిన కంపెనీలు ఓలా కంపెనీకు పోటీగా కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఫీచర్లు, బుల్డ్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పోటీనిస్తున్నాయి. ఇలా ఓలా స్కూటర్లకు పోటీగా జైపూర్‌కు ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ బ్యాట్ రీ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టోరి నాలుగు కొత్త రంగుల్లో ఓ కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాట్ రీ పేరుతో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ఐస్ బ్లూ, స్ట్రైట్ బ్లూ, క్యాండీ రెడ్, ఎక్రూ రంగుల్లో వస్తుంది. ఇప్పటికే ఈ స్కూటర్ బ్లాక్, స్టార్మీ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ధరతో పాటు ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్ ఓలా ఎస్ 1 ఎయిర్‌కు ప్రధాన పోటీగా నిలవనుంది.
ఈ స్కూటర్ రూ.89,600 (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ 2 కేడబ్ల్యూ హబ్ బీఎల్‌డీసీ మోటర్ నుంచి శక్తిని పొందుతుంది. ఓ చార్జ్‌తో ఏకంగా 132 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే గరిష్టంగా గంటకు 62 కిలో మీటర్ల స్పీడ్‌తో ఈ స్కూటర్ దూసుకుపోతుందని వెల్లడిస్తున్నారు. కేవలం ఐదు గంటల్లో ఈ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేయవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం యువత అమితంగా ఇష్టపడే రంగుల్లో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల సేల్స్ పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్కూటర్‌లో ధృఢమైన నిర్మాణ నాణ్యత కోసం మెటల్ ప్యానెల్స్‌ను ఉపయోగించారు. అలాగే బ్లూటూత్ కనెక్టవిటీతో కూడిన ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అమర్చారు. టెలి మెట్రీ, కాల్/ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, నావిగేషన్ వంటి సౌకర్యాలను ఈ స్కూటర్ ద్వారా పొందవచ్చు. ఈ స్కూటర్ కేవలం ఓలా ఎస్ 1 ఎయిర్‌తో పోటీ పడడమే కాకుండా ఒకయా, ఒకెనివా, అంపెర్, ప్యూర్ ఈవీ వంటి కంపెనీల స్కూటర్లకు గట్టి పోటీనిచ్చేలా డిజైన్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..