Bathroom Designing: ఇంటి బాత్రూమ్ ఫిటింగ్స్ విషయంలో ఆ తప్పు చేయకండి.. లేకపోతే ఇబ్బందులు పడాతారు!

|

Jun 04, 2023 | 2:22 PM

ఇంటిని నిర్మించేటప్పుడు బాత్రూమ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాత్రూమ్‌లో ఏర్పాటు చేసే శానిటరీ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే నాణ్యత లేనివిగా నిర్మిస్తే ఆర్థిక నష్టంతో పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మీ ఇంటిని నిర్మించినప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు చాలా జాగ్రత్తలు..

Bathroom Designing: ఇంటి బాత్రూమ్ ఫిటింగ్స్ విషయంలో ఆ తప్పు చేయకండి.. లేకపోతే ఇబ్బందులు పడాతారు!
Bathroom Designing
Follow us on

ఇంటిని నిర్మించేటప్పుడు బాత్రూమ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాత్రూమ్‌లో ఏర్పాటు చేసే శానిటరీ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే నాణ్యత లేనివిగా నిర్మిస్తే ఆర్థిక నష్టంతో పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మీ ఇంటిని నిర్మించినప్పుడు లేదా పునరుద్ధరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ బాత్రూమ్‌ విషయంలో ఇలా నిర్లక్ష్యం చేస్తే సమస్య వస్తుంది. ఇంటిని నిర్మించేటప్పుడు ఎలాంటి శ్రద్ద చూపుతారో.. బాత్‌గ్రూమ్‌ నిర్మించేటప్పుడు కూడా అంతే శ్రద్ద వహించాలి. బాత్‌గ్రూమ్‌లో శానిటరి ఫిట్టింగ్‌లపై చాలా శ్రద్ధ తీసుకోవాలి. దీనికోసం ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు, శానిటరీ వేర్ విభాగంలోకి వచ్చే వస్తువుల గురించి తెలుసుకుందాం.

శానిటరీ వేర్ విభాగంలోకి వచ్చే అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు, WC, వాటర్ క్లోసెట్ లేదా వెస్ట్రన్ టాయిలెట్ అని కూడా పిలుస్తారు. మామూలు టాయిలెట్ ప్లేట్ కూడా ఉంటుంది. దీనిని దేశీ లేదా తూర్పు టాయిలెట్ అని కూడా పిలుస్తారు. అంతే కాకుండా వాటర్ సింక్, డ్రైనేజ్ పైప్ కనెక్టర్ వంటివి ఉంటాయి. ఇవి మీ ఇంట్లో ఉపయోగించే వ్యర్థ పదార్థాలను, పనికి రాని వాటర్‌ను బయటకు పంపేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

అయితే మీరు శానిటరీ సామాను కొన్నప్పుడు నీటిని పొదుపు చేయడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆలోచించకపోవచ్చు. కమోడ్‌లు, ఫ్లష్ సిస్టమ్‌లు, షవర్‌లు, ట్యాప్‌లు వంటి శానిటరీ ఫిటింగ్స్ నీటిని ఉపయోగిస్తాయి. ఇటువంటి శానిటరి వస్తువు కొనుగోలు చేసే ముందు ఆలోచించి మంచి నాణ్యతతో కూడివి కొనుగోలు చేస్తే నీటిని ఆదా చేయడంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉదాహరణకు.. మార్కెట్‌లో సాధారణంగా రెండు రకాల ఫ్లష్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, మీరు తక్కువ ఫ్లో ఉన్న కుళాయిలు, షవర్లను ఉపయోగించాలి. ఈ రెండు పద్ధతులు విద్యుత్, నీటి బిల్లులను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే అన్నింటికంటే ఇవి పర్యావరణానికి సహాయకరులుగా ఉంటాయి. శానిటరీవేర్‌ను కొనుగోలు చేసే ముందు మీరు బాత్రూంలో ఎంత స్థలం అందుబాటులో ఉంది..? వాటిని ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని ముందుగానే గుర్తించాలి. తద్వారా స్థలాన్ని సరిగ్గా వినియోగించుకోవచ్చు. శానిటరీవేర్ వివిధ స్టైల్స్, సైజులు, పొడవు, రంగులు, వెడల్పులలో వస్తుంది. బాత్రూమ్ స్పేస్ ప్రకారం తగిన ప్రొడక్ట్స్ ఎంచుకోండి.

ఇంట్లోని బాత్‌రూమ్‌ అనేది జారి పడిపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే ప్రాంతం. తడి ఉండటం వల్ల తీవ్రమైన గాయాలు కావచ్చు. అందుకే బాత్రూమ్ టైల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ నునుపుగా ఉండే టైల్స్ లాంటివి ఉపయోగించకూడదు. గ్రిప్ ఉండే వాటిని ఉపయోగించాలి. మీ కుటుంబంలో వృద్ధులు లేదా పిల్లలు ఉన్నట్లయితే టాయిలెట్ సీటు, స్నానపు ప్రదేశంలో హ్యాండ్‌రైల్‌లను అమర్చండి. ఈ ప్రాంతంలో నీరు లీకేజీ కాకుండా సరైన ఫిట్టింగ్‌ సరిగ్గా ఉండేలా చూడండి. అలాగే బాత్రూమ్‌లో తేమ, ఊపిరాడకుండా ఉండే అవకాశం ఉన్నందున బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయండి. అతి ముఖ్యమైన విషయం నేరుగా మీ జేబుకు సంబంధించినది. బ్రాండెడ్, నాన్-బ్రాండెడ్ శానిటరీవేర్లలో ఏది ఎంచుకోవాలి అనేది ముఖ్యమైనది. సాధారణంగా బ్రాండెడ్ వాటికి వారెంటీ ఉంటుంది. అందువల్ల వాటిని ఉపయోగించడం కాస్త ఖరీదు ఎక్కువైనా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే, నాన్ బ్రాండెడ్ వస్తువులు వాడి.. ఎప్పటికప్పుడు అవి పాడైపోతే మళ్ళీ కొత్తవి కొనాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అది మన డబ్బును పాడుచేస్తుంది. అందువల్ల వీలున్నంత వరకూ బ్రాండెడ్ వస్తువులు కొనడం మంచిదని నిపుణులు చెబుతారు.

పైప్‌లైన్‌ లోపం, నీటి వృథాపై అశోక్‌ ఆందోళన సరైనదే. ఆ ఆందోళన లేకుండా ఉండాలంటే, అధిక-నాణ్యత గల శానిటరీవేర్‌ను ఉపయోగించడం ద్వారా నీటి వృధా, మరమ్మత్తు ఖర్చు రెండూ ఆదా అవుతాయి. ఎప్పుడూ ISI గుర్తుతో శానిటరీ వస్తువులను కొనుగోలు చేయండి. నాన్-బ్రాండెడ్ శానిటరీవేర్ కూడా మంచి నాణ్యతను అందించే అవకాశం ఉంటుంది. చాలా మంది దుకాణదారులు ఈ ప్రొడక్ట్స్ మనకు అమ్మడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మీరు ఈ వస్తువుల నాణ్యతను తనిఖీ చేయాలి. దీనికోసం ప్లంబింగ్ ఇంజనీర్ లేదా ప్లంబర్ సహాయం తీసుకోండి. మీరు మరిన్ని వస్తువులను కొనుగోలు చేయవలసి వస్తే హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడాన్ని ప్రయత్నించండి. ఇక్కడ మీరు రిటైల్ మార్కెట్‌తో పోలిస్తే 20-25% వరకు తక్కువ ధరకు ప్రోడక్ట్స్‌ను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి