Savings Account Interest Rates: ఈ రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారు చాలా మందే ఉన్నారు. కొందరు ఎక్కడ ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలియక నష్టపోతుంటారు. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇది అనేక బ్యాంకుల స్థిర డిపాజిట్ రేట్ల కంటే ఎక్కువ. కొందరు బ్యాంకుల్లో డబ్బు పెట్టేందుకు బ్యాంకులను ఎన్నుకునేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. తద్వారా వారు వివిధ పొదుపు ఖాతాలో ఈ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఉపయోగించుకోవచ్చు. పలు బ్యాంకులు 6.25 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనకు విముఖత ఉన్నవారు తెలివిగా అధిక వడ్డీ చెల్లించే బ్యాంకులను ఎంచుకోవచ్చు. ప్రైవేటు రుణదాతలలో, పొదుపు ఖాతాలో గరిష్ట వడ్డీ రేటును ఆర్బీఎల్ బ్యాంకు అందిస్తోంది. ఆర్బీఎల్ లాభదాయకమైన వడ్డీ రేటును సంవత్సరానికి 4.5శాతం నుంచి 6.25 శాతం వరకు రోజువారీ బ్యాలెన్స్‌పై అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.
అ దే విధంగా బంధన్ బ్యాంకు తన పొదుపు ఖాతాలో సంవత్సరానికి 3.0 నుంచి 6.0శాతం వరకు వడ్డీ రేట్లను రూ.10 కోట్ల వరకు అందిస్తోంది. అయితే 10 కోట్లకు మించి మొత్తానికి బ్యాంకును సంప్రదించవచ్చని బంధన్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ చెబుతోంది. ఈ రేట్లు జూన్ 7, 2021 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక ఇండస్ ఇండ్ బ్యాంకు పొదుపు ఖాతా వడ్డీ రేటు 4శాతం నుంచి 5.5 శాతం వరకు రూ.1 కోట్ల వరకు ఉంటుంది. దీని కోసం బ్యాంకు మేనేజర్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు చెబుతారు.