Low Interest Home Loan: దేశంలో చాలా మంది తీసుకునే రుణాల్లో హోమ్ లోన్(Housing Loan) బహుశా వినియోగదారుడు తీసుకునే అతిపెద్ద రుణం. లోన్ మొత్తం పరంగా మాత్రమే కాకుండా.. దాని చెల్లింపు సమయం కూడా 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. దీనిలో మరో కీలకమైనది ఏమిటంటే.. ఒక్కోసారి రుణం తీసుకున్న దానికంటే చెల్లిస్తున్న మెుత్తం డబుల్ ఉండటం. కానీ.. అన్నింటికన్నా తక్కువ వడ్డీ(Interest Rate) రేటు కలిగి ఉండే లోన్ కేవలం హౌసింగ్ లోన్ మాత్రమే. ఇల్లు కొనటం లేదా నిర్మించాలనుకునే వారు ప్రైవేటుగా డబ్బు రుణంగా తీసుకోవటం కంటే బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ పొందటం ఉత్తమం. హోమ్ లోన్ ను గుడ్ లోన్ అని అంటారు ఎందుకంటే.. రుణగ్రహీత తీసుకునే మెుత్తం వల్ల అతనికి ఒక ఆస్తి సృష్టింపబడుతుంది. సొంత నివాసం కోసం హౌస్ లోన్ తీసుకోవాలనుకుంటే అది మంచి నిర్ణయం. దేశంలో నిర్మాణ రంగంలో ప్రాజెక్టుల కట్టడంలో జాప్యం ఎక్కువగా ఉంటున్నందున.. నిపుణుల సలహా ఏమిటంటే కొన్న వెంటనే వినియోగానికి వీలుగా నిర్శాణ పనులు పూర్తైన గృహాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్ లో కొన్ని ప్రముఖ బ్యాంకులు అత్యంత తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇవీ చదంవండి..
Russia-Ukraine War: శాంతి చర్చలకు ఓకే అన్న రెండు దేశాలు.. కానీ అణ్వాయుధాలపై రష్యా కీలక ప్రకటన..
Russia-Ukraine War: భారతీయులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు గంటకు ఎంత ఖర్చవుతుందో తెలుసా..