Banking Hours : తెలంగాణలో క్రమంగా మామూలు స్థితికి జనజీవనం.. రేపటి నుంచి బ్యాంకు పనివేళలు సైతం సాధారణ సమయాల్లోనే..

|

Jun 09, 2021 | 7:00 PM

కరోనా మహమ్మారి తెలంగాణ వ్యాప్తంగా నెమ్మదిస్తుండటంతో ప్రభుత్వం పగటి పూట లాక్ డౌన్ ను ఎత్తివేసింది. దీంతో జనజీవనం క్రమంగా మామూలు స్థితికి చేరుతోంది..

Banking Hours : తెలంగాణలో క్రమంగా మామూలు స్థితికి జనజీవనం.. రేపటి నుంచి  బ్యాంకు పనివేళలు సైతం సాధారణ సమయాల్లోనే..
Banks
Follow us on

Bank Working hours : కరోనా మహమ్మారి తెలంగాణ వ్యాప్తంగా నెమ్మదిస్తుండటంతో ప్రభుత్వం పగటి పూట లాక్ డౌన్ ను ఎత్తివేసింది. దీంతో జనజీవనం క్రమంగా మామూలు స్థితికి చేరుతోంది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఆర్టీసీ, మెట్రో రైళ్ల సేవలు కూడా మరింత ఎక్కువగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే బ్యాంకులు కూడా రేపటి నుండి సాధారణ సమయాల్లోనే పని చేస్తాయి. లాక్​డౌన్ విరామ సమయం పెరగడంతో రాష్ట్రంలోని బ్యాంకు పని వేళల్లో ఈ మేరకు మార్పులు చేశారు. లాక్ డౌన్ కు ముందు బ్యాంకులు ఏ సమయాల్లో పనిచేశాయో అదే సమయాన్ని రేపటి నుంచి అనుసరిస్తాయని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. కాగా, పగటి పూట లాక్ డౌన్ ఎత్తివేయడంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచింది టీఎస్ఆర్టీసీ. ఫలితంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి.

లాక్​డౌన్​ విరామ సమయం పెరగడంతో బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్​ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు తిప్పుతున్నామని… వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని ఆయన స్పష్టం చేశారు.

అటు, హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణ వేళల్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైళ్లను తిప్పుతామని హైదరాబాద్ మెట్రో తెలిపింది. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read also :  YS Sharmila: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీ పై మరింత క్లారిటీ… పూర్తి వివరాలు