Bank Loan: బిజినెస్ చేస్తున్నారా? లోన్ రావట్లేదా?.. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది!

|

Jan 06, 2024 | 5:00 AM

బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా మంచి క్రెడిట్ స్కోర్ ను సాధించగలరు. సకాలంలో బిల్లులు చెల్లించడం, బాధ్యతాయుతంగా తమ రుణాలను చెల్లించడం ద్వారా దీని సాధించవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బలంగా లేకపోతే, రుణం కోసం గ్యారంటేటర్ ని కలిగి ఉంటే.. మీకు కొంత హెల్ప్ కావచ్చు. ఇది కాకుండా, మీరు పెద్ద డౌన్ పేమెంట్ చేసినా మంచిదే. ఎందుకంటే.. ఈ పెద్ద డౌన్ పేమెంట్ మీ ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతుంది. లోన్-టు..

Bank Loan: బిజినెస్ చేస్తున్నారా? లోన్ రావట్లేదా?.. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది!
Bank Loan
Follow us on

మీరు కూడా సొంతంగా బిజినెస్ చేసినా.. లేదా మీకు ప్రతినెలా జీతం వచ్చే సాధారణ ఉద్యోగం చేయకపోయినా.. మీకు రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. ఈ సంవత్సరం విడుదలైన పైసాబజార్ “మేకింగ్ ఇండియా క్రెడిట్ ఫిట్” నివేదిక ప్రకారం, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం రుణాలు పొందే రేటు కేవలం 19 శాతం మాత్రమే. అయితే జీతం పొందే వ్యక్తులలో ఈ సంఖ్య 28 శాతం.

బ్యాంకులు సాధారణంగా స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే వారికి ఉద్యోగం లేదు. ఆదాయం లేదు. అయినా సరే.. మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సరే.. మీకు సులభంగా హోమ్ లోన్ వచ్చే కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

దీని గురించి శాటిలైట్ డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ హిమాన్షు జైన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిలు రుణం తీసుకునే వారి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అందుకే గృహ రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు, స్వయం ఉపాధి పొందే వ్యక్తి తాలుకా క్రెడిట్ స్కోర్ కచ్చితంగా బాగుండాలి. స్వయం ఉపాధి వ్యక్తులు రుణాలు పొందడంలో ఇబ్బందులు పడతారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. జీతం పొందే వ్యక్తులతో పోలిస్తే.. వారికి ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హెల్దీ క్రెడిట్ లేదు అంటే వారి క్రెడిట్ స్కోరు బాగా లేదని అర్థం. పైసాబజార్ నివేదిక ప్రకారం, జీతం పొందేవారిలో 25 శాతం మంది 770 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉన్నారు. స్వయం ఉపాధి పొందిన వ్యక్తుల విషయంలో ఈ సంఖ్య కేవలం 14 శాతం మాత్రమే. అందుకే మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండడం చాలా ముఖ్యం.

బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా మంచి క్రెడిట్ స్కోర్ ను సాధించగలరు. సకాలంలో బిల్లులు చెల్లించడం, బాధ్యతాయుతంగా తమ రుణాలను చెల్లించడం ద్వారా దీని సాధించవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ బలంగా లేకపోతే, రుణం కోసం గ్యారంటేటర్ ని కలిగి ఉంటే.. మీకు కొంత హెల్ప్ కావచ్చు. ఇది కాకుండా, మీరు పెద్ద డౌన్ పేమెంట్ చేసినా మంచిదే. ఎందుకంటే.. ఈ పెద్ద డౌన్ పేమెంట్ మీ ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతుంది. లోన్-టు-వాల్యూ నిష్పత్తిని తగ్గిస్తుంది. అంటే మీరు చెల్లించాల్సిన రుణాన్ని తగ్గిస్తుంది.

బిజినెస్ చేసేవారు.. తమ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాన్ని… ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్, ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ లో చూపించాలి. అందుకే వ్యాపారానికి సంబంధించి.. ఖచ్చితమైన, అప్ టూ డేట్ ఉండేలా రికార్డ్స్ నిర్వహించాలి. మీకు లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి, బ్యాంక్ లేదా NBFC… మీ వ్యాపారం, గత 2-3 సంవత్సరాల పన్ను రిటర్న్‌లను చూస్తుంది. కొన్ని సందర్భాల్లో, లైసెన్స్, రిజిస్ట్రేషన్, క్లయింట్ సంప్రదింపు వంటి వివరాలను అడుగుతారు. దీనిని బట్టి మీరు ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు అనేది వారికి అర్థమవుతుంది.

వ్యాపారం నుండి స్థిరమైన ఆదాయాన్ని పొందే వ్యక్తులకు.. అప్పిచ్చేవారు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. రుణం ఇస్తున్నప్పుడు, బ్యాంకులు మీ వద్ద తగినంత నగదు ఉందా లేదా అని కూడా తనిఖీ చేస్తుంది. ఇది వారికి సెక్యూరిటీని ఇస్తుంది. ఆదాయంతో పోలిస్తే.. రుణం తక్కువగా ఉండాలి. అంటే, ఆదాయంలో ఎంత శాతాన్ని రుణ చెల్లింపు కోసం కేటాయిస్తున్నాం అన్నది ముఖ్యం. ఈ నిష్పత్తిని తగ్గించడం చాలా ముఖ్యం. ఇది మీరు రుణం పొందే అవకాశాలను పెంచుతుంది.

ఆదాయానికి రుణ నిష్పత్తి 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే, మీకు లోన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు దీనిని 20 శాతం కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా, మీ బిజినెస్ స్ట్రక్చర్… అంటే అది మీ స్వంత వ్యాపారమైనా, భాగస్వామ్యమైనా లేదా కంపెనీ అయినా సరే.. మీరు రుణం పొందే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఇతర వాటితో పోలిస్తే.. కొన్ని వ్యాపారాలు స్థిరంగా ఉన్నాయని బ్యాంకులు భావిస్తాయి.

మొత్తంమీద, బిజినెస్ చేసేవారి క్రెడిట్ హిస్టరీని రూపొందించడానికి కొంత సమయం పట్టవచ్చు. మీకు ఇప్పటికే క్రెడిట్ కార్డ్ లేదా మరేదైనా లోన్ ఉంటే, దాన్ని సకాలంలో చెల్లిస్తూ ఉండండి. మీ వ్యాపార ఒప్పందానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచండి. మీరు హోమ్ లోన్ కోసం అప్లయ్ చేసినట్లయితే, బ్యాంకుకు సరైన సమాచారం ఇవ్వండి. ఇది మీరు రుణం తీసుకోవడాన్ని సులభం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి