Telugu News Business Bank holidays in August 2025: Banks will be closed on THESE 15 days
Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
August Bank Holidays: ఆగస్ట్ నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను..
జూలై నెల ముగియబోతోంది. ఆగస్టు 2025కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవులను జారీ చేస్తుంటుంది. మొత్తం మీద ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి, ఇతర ప్రాంతీయ వేడుకలు, శని, ఆదివారపు సెలవులతో సహా మొత్తం 15 హాలిడేస్ రానున్నాయి. భారతదేశంలోని అన్ని బ్యాంకులు , ప్రభుత్వ, ప్రైవేట్, రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రామలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.