Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. ఈ వారంలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్ అంటే..

|

Nov 10, 2021 | 11:33 AM

అకౌంట్ పనిమీద బ్యాంకుకు వెళ్తున్నారా ? అయితే మీరు వెళ్లే రోజున.. లేదా సమయానికి బ్యాంక్ ఓపెన్ చేసి ఉంటుందా ? అనే విషయాలు

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్..  ఈ వారంలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్ అంటే..
Bank Holidays
Follow us on

అకౌంట్ పనిమీద బ్యాంకుకు వెళ్తున్నారా ? అయితే మీరు వెళ్లే రోజున.. లేదా సమయానికి బ్యాంక్ ఓపెన్ చేసి ఉంటుందా ? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నెల ప్రారంభంలోనే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడూ అనే విషయాలను ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రాల వారిగా సెలవులు మారుతూ ఉంటాయి. అందుకే బ్యాంకులో పని ఉన్న సమయంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ వారం బ్యాంకులకు చాలానే సెలవులు ఉన్నాయి. ఈరోజు సూర్య షష్టి ఛత్ పూజా సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.. ఈ పండుగను ఎక్కువగా బీహార్, జార్ఖండ, ఉత్తర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈరోజు బ్యాంకులు పనిచేయవు. ఇక నవంబర్ 11న ఛత్ పూజా కారణంగా పాట్నాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే నవంబర్ 12న వంగల పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ పండుగను మేఘాలయ రాష్ట్రంలో మాత్రమే జరుపుకుంటారు. ఇక నవంబర్ 13న రెండవ శనివారం.. అలాగే నవంబర్ 14న ఆదివారంతో బ్యాంకులు బంద్ ఉంటాయి.  దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు గెజిటెడ్ సెలవులు మాత్రమే పాటిస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నెగోషియబుల్ ఇన్ర్ట్సుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, నెగోషియబుల్ ఇన్ర్టుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‏మెంట్ హాలిడే కింద బ్యాంకులు సెలవులను నిర్ణయిస్తారు.

ఈ నెలలో బ్యాంకు హాలీడేస్..
నవంబర్ 19, 2021: గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ
నవంబర్ 21, 2021 – ఆదివారం
నవంబర్ 22, 2021: కనకదాస జయంతి
నవంబర్ 23, 2021: సెంగ్ కుట్స్‌నెమ్
నవంబర్ 27, 2021 – నాల్గవ శనివారం
నవంబర్ 28, 2021 – ఆదివారం

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా ?.. వీడియో షేర్ చేసిన రౌడీ హీరో..

Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్.. అదిరిపోయిన అనసూయ న్యూలుక్..

Anasuya Bharadwaj: అవసరమైతే.. గుండు కొట్టించుకుంటా.. యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్