Banks FD: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31 లాస్ట్ డేట్.. 5 సూపర్ ఎఫ్‌డీ ప్లాన్స్ ఇవే..

|

Mar 14, 2023 | 3:10 PM

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణ వల్ల తీసుకున్న రుణాలపై భారం పడటంతో పాటు..

Banks FD: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మార్చి 31 లాస్ట్ డేట్.. 5 సూపర్ ఎఫ్‌డీ ప్లాన్స్ ఇవే..
Fd
Follow us on

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణ వల్ల తీసుకున్న రుణాలపై భారం పడటంతో పాటు.. పెట్టుబడులపై వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తరువాత చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. అనేక బ్యాంకులు ఎఫ్‌డీలపై మెరుగైన రిటర్న్ ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తున్నాయి.

ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సీ, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ సహా కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లు, పరిమిత కాల ఎఫ్‌డీలపై కొత్త స్కీమ్‌లను ప్రకటించాయి. అయితే, ఈ స్కీమ్‌లన్నీ మార్చి 31, 2023తో ముగియనున్నాయి. మరికొద్ది రోజుల్లో ముగియనున్న 5 ప్రత్యేక ఎఫ్‌డీల వివరాలు ఇప్పుడు మీకోసం అందిస్తున్నాం.

SBI – అమృత్ కలాష్ డిపాజిట్ పథకం..

భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఇటీవల దేశీయ, ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఒక స్కీమ్‌ను ప్రకటించింది. 400 రోజుల కాలవ్యవధితో కూడిన కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాన్ని ప్రకటించింది. దీని పేరు SBI అమృత్ కలాష్ డిపాజిట్. ఈ పథకం కింద కస్టమర్లకు 7.10 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 7.60 వడ్డీని అందిస్తోంది. అయితే, SBI అమృత్ కలాష్ డిపాజిట్ స్కీమ్ పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి

HDFC – సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ..

HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ FDని 2020లో ప్రారంభించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు కస్టమర్లు 31 మార్చి 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. HDFC బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ FD ఆఫర్‌తో 0.75% అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ఆఫర్ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల దేశీయ సీనియర్ సిటిజన్‌లకు అందిస్తోంది. రూ.5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లను 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధికి పెట్టుబడికి ఇది వర్తిస్తుంది.

ఇండియన్ బ్యాంక్ IND శక్తి 555 రోజుల ఎఫ్‌డీ స్కీమ్..

ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక రిటైల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్ “IND శక్తి 555 DAYS”ని డిసెంబర్ 19, 2022న ప్రారంభించింది. దీని ద్వారా 5000 రూపాయల నుండి 2 కోట్ల రూపాయల కంటే తక్కువ పెట్టుబడి కోసం 555 రోజుల పాటు FD/MMD రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై బ్యాంకు ఎక్కువ వడ్డీని అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్ IND శక్తి 555 రోజుల FD స్కీమ్ 31 మార్చి 2023 వరకు చెల్లుబాటవుతుంది.

IDBI బ్యాంక్ నమన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్..

IDBI బ్యాంక్ నమన్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో అదనపు వడ్డీని పొందేందుకు సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది. IDBI బ్యాంక్ నమన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ అనేది పరిమిత కాల ఆఫర్. ఇది మార్చి 31, 2023 వరకు చెల్లుబాటవుతుంది. సీనియర్ సిటిజన్ 0.75% వరకు అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. కనీస డిపాజిట్ మొత్తం రూ. 10,000 నుండి ప్రారంభమవుతుంది. పథకంలో మెచ్యూర్‌కు ముందు ఉపసంహరించుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే, స్వీప్-ఇన్‌లు, పాక్షిక ఉపసంహరణలతో సహా అటువంటి అకాల ఉపసంహరణలపై బ్యాంక్ వర్తించే రేటుపై 1% పెనాల్టీని విధిస్తుంది.

పంజాబ్ & సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD పథకం..

పంజాబ్ & సింద్ బ్యాంక్ ప్రత్యేక FD స్కీమ్‌ను అందిస్తోంది. దీని గడవు కూడా మార్చి 31, 2023న గడువు ముగుస్తుంది. వీటిలో PSB ఫ్యాబులస్ 300 రోజులు, PSB ఫ్యాబులస్ ప్లస్ 601 రోజులు, PSB ఇ-అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, PSB-ఉత్కర్ష్ 222 రోజులు స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా బ్యాంక్ తన కస్టమర్స్‌కి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..