Amazon Sales : అదరగొడుతున్న అమెజాన్ సేల్స్… ఆ ప్రొడెక్ట్స్ పై భారీ తగ్గింపులు.. ఈ ఒక్కరోజే గడువు..

కేవలం ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుండడంతో అంతా ఈ సేల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులున్నాయో? చెక్ చేసుకుని వాటి కొనుగోలు చేసుకోండి.

Amazon Sales : అదరగొడుతున్న అమెజాన్ సేల్స్… ఆ ప్రొడెక్ట్స్ పై భారీ తగ్గింపులు.. ఈ ఒక్కరోజే గడువు..
Amazon
Follow us
Srinu

|

Updated on: Mar 14, 2023 | 12:15 PM

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల 11న నుంచి సరికొత్త సేల్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుండడంతో అంతా ఈ సేల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఈ సేల్ ఈ రోజుతో ముగుస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీ కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ప్రొడెక్ట్స్‌పై భారీ తగ్గింపులున్నాయో? చెక్ చేసుకుని వాటి కొనుగోలు చేసుకోండి. అలాగే ఈ సేల్‌లో  హెచ్‌డీఎఫ్‌సీ, ఎచ్ఎస్‌బీసీ బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్‌పై 10 శాతం ఇన్‌స్టెంట్ తగ్గింపు కూడా లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్ ఉపకరణాలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కొనుగోలుదారులు సైట్‌లో నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో వస్తున్న ప్రొడెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం.

ప్రధాన డీల్స్ ఇవే

  • ఈ సేల్‌లో ఆసస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ రూ. 35,990కి అందుబాటులో ఉంది, అయితే మీరు లెనెవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్‌ను రూ.33,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు 10% తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎంఐపై కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ. 1,699కి ఈ సేల్‌లో లభిస్తుంది. అలాగే నింజా కాల్ ప్రో కూడా రూ. 1,599కి అందుబాటులో ఉంది.
  • యాపిల్ వాచ్ ఎస్ఈ రూ. 34,990కు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌పై రూ. 1500 తగ్గింపు వస్తుంది. అలాగే వాచ్‌పై కంపెనీ పాకెట్-ఫ్రెండ్లీ ఈఎంఐలను కూడా అందిస్తుంది.
  • అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్‌లో ఇయర్‌బడ్స్, స్పీకర్, బోట్ ఎయిర్‌డోప్స్ ఆటమ్ 81 రూ. 999కి అందుబాటులో ఉన్నాయి.
  • ఇక సౌండ్ బార్స్ విషయానికి వస్తే అవంటే బార్ ఓరియన్ సౌండ్‌బార్‌ రూ. 7,499 అందుబాటులో ఉంటుంది. అలాగే జిబ్రానిక్స్ జక్ బార్ 9500 డబ్ల్యూఎస్ ప్రో స్పీకర్ రూ.14999కు అందుబాటులో ఉంది. 
  • సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..