Multibagger Return: 13 సంవత్సరాల్లో లక్షాధికారిని కోటీశ్వరులను చేసిన షేర్.. పూర్తి వివరాలు..

|

Mar 21, 2022 | 9:04 AM

Multibagger Return: షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని తెలిసినా చాలా మంది డబ్బులు పెడుతుంటారు. సరైన వ్యాపారనిర్వహణ, ఆర్థిక ఫలితాలను అందించే కొన్ని కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెట్టేవారికి.. అవి భారీగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి.

Multibagger Return: 13 సంవత్సరాల్లో లక్షాధికారిని కోటీశ్వరులను చేసిన షేర్.. పూర్తి వివరాలు..
Multibagger Stock
Follow us on

Multibagger Return: షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని తెలిసినా చాలా మంది డబ్బులు పెడుతుంటారు. సరైన వ్యాపారనిర్వహణ, ఆర్థిక ఫలితాలను అందించే కొన్ని కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెట్టేవారికి.. అవి భారీగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. కాలక్రమంలో షేర్ వాల్యూ పెరిగి ఇన్వెస్టర్లకు(Investors) లాభాల పంటను పండిస్తుంటాయి. భారత స్టాక్ మార్కెట్లో వేల సంఖ్యలో కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. కానీ కొన్ని స్టాక్స్ మాత్రమే లాభాలు తెస్తుంటాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో బాలకృష్ణ ఇండస్ట్రీస్(Balakrishna Industries) ఒకటి. ఈ కంపెనీ పెట్టుబడిదారులకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. గత 13 సంవత్సరాల కాలంలో.. దీని షేర్ విలువ రూ. 12.18 నుంచి రూ. 2132కు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ షేరు 16,520 శాతానికి పైగా పెరగటం గమనార్హం.

గత సంవత్సర కాలంలో కంపెనీ ఒక్కో షేర్ విలువ దాదాపు రూ. 1640 నుంచి రూ.2100 వరకు పెరిగింది. ఏడాదిలోనే ఈ స్టాక్ దాదాపుగా 22 శాతం వృద్ధిని అందించింది. గత 5 ఏళ్ల కాలాన్ని పరిళీలిస్తే.. రూ.700 నుంచి రూ.2100కు షేర్ వ్యాల్యూ పెరిగిపోయింది. ఇదే సమయంలో ఈ షేర్ 10 సంవత్సరాల గమనాన్ని పరిశీలిస్తే.. 1500 శాతం వృద్ధితో మంచి మల్టీబ్యాగర్ రిటర్స్ ను తన ఇన్వెల్టర్లకు అందించింది. ఏడాది కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెడితే.. అది ఇప్పుడు రూ. 1.22 లక్షలు అవుతుంది. ఐదేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ.2.85 లక్షలకు చేరుతుంది.10 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ నేడు రూ.16 లక్షలుగా ఉండేది. ఇక 13 ఏళ్ల క్రితం ఇందులో లక్ష పెట్టుబడి పెట్టిన వారిని ఈ షేర్ కోటీశ్వరులను చేసింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ షేర్ లో పెట్టుబడి విలువ రూ.1.64 కోట్లుగా ఉంది.

NOTE: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న అంశం. ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోవటం ఉత్తమం.

ఇవీ చదవండి..

India-Australia Summit: భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులు.. నేడు ఇరు దేశ ప్రధానుల మధ్య మీటింగ్..

Fixed Deposit: మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా..? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..!