Bajaj Pulsar 125: బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లతో పోటీపడేలా అత్యాధునిక ఫీచర్లు

ఇప్పటికే ఉన్న పల్సర్ లైనప్‌ను కూడా అప్డేట్ చేస్తోంది. 2024 పల్సర్ 125తో ఈ హవా ప్రారంభిస్తుంది. అప్‌డేటెడ్ పల్సర్ 125లు కొత్త ఫీచర్లతో డీలర్లను చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఇది పల్సర్ ఎన్ 250కి సమానమైన పూర్తి డిజిటల్ కన్సోల్‌తో వచ్చే ఈ బైక్‌లు కొత్త లెఫ్ట్ స్విచ్-క్యూబ్ సంభావ్య మోడ్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ నేపథ్యంలో పల్సర్ 125 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Bajaj Pulsar 125: బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లతో పోటీపడేలా అత్యాధునిక ఫీచర్లు
Bajaj Pulsar 125
Follow us

|

Updated on: May 04, 2024 | 3:35 PM

బజాజ్ ఆటో కొత్త పల్సర్ మోడళ్లను విడుదల చేయడానికి ఇటీవల కాలంలో ఉత్సాహంగా ఉంది. ఈ కంపెనీ ఇప్పటికే ఉన్న పల్సర్ లైనప్‌ను కూడా అప్డేట్ చేస్తోంది. 2024 పల్సర్ 125తో ఈ హవా ప్రారంభిస్తుంది. అప్‌డేటెడ్ పల్సర్ 125లు కొత్త ఫీచర్లతో డీలర్లను చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఇది పల్సర్ ఎన్ 250కి సమానమైన పూర్తి డిజిటల్ కన్సోల్‌తో వచ్చే ఈ బైక్‌లు కొత్త లెఫ్ట్ స్విచ్-క్యూబ్ సంభావ్య మోడ్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ నేపథ్యంలో పల్సర్ 125 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఆధారంగా ఈ బైక్ డిజైన్, హార్డ్వేర్ విషయాల్లో పెద్దగా మార్పులు లేవని తెలుస్తుంది. అయితే మస్కులర్ బాడీవర్క్, డీఆర్‌ఎల్‌తో హాలోజన్ హెడ్లైట్, సిట్ సీట్, గ్రాబ్ రైల్ వంటి సుపరిచితమైన ఫీచర్లతో వస్తుందని తెలుస్తోంది. ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్లు, వెనుక డ్రమ్ బ్రేక్ల తో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. 124.4 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పాటు ఈ బైక్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ బైక్ పవర్, టార్క్ ఫిగర్లను వరుసగా 11.64 బీహెచ్‌పీ, 10.8 ఎన్ఎం అందిస్తుంది.

కొత్త ఫీచర్ల జోడింపు విషయానికి వస్తే పల్సర్ 125 ధరను దాని ప్రస్తుత రూ. 90,003 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి కొద్దిగా పెంచవచ్చు. అంటే ఈ ధర ఎన్ 250 ధరను ప్రతిబింబిస్తుంది. ఈ బైక్ 125 సీసీ విభాగంలో పోటీ పడుతోంది. ఈ బైక్ హెూండా ఎస్‌పీ 125, టీవీఎస్ రైడర్ 125, హీరో గ్లామర్ వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అంచనా వేస్తన్నారు. అలాగే బజాజ్ ఇటీవల పల్సర్ 400ని కూడా ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే 2024 పల్సర్ ఎన్ఎస్ 400 దాని అండర్ ఇన్నింగ్స్‌ను ఎన్ఎస్ 200తో పంచుకునే అవకాశం ఉంది. ఈ బైక్‌లో డోమినార్ 400 నుండి ఇంజన్ ను తీసుకుంటుంది. బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ 400ని డొమినార్ 400కు సంబంధించిన 373 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ 40 బీహెచ్‌పీ, 35 ఎన్ఎం టార్క్‌లను జెనరేట్ చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి