హానీమూన్‌ టూర్‌కి బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రొటక్షన్..!

| Edited By:

Dec 19, 2019 | 4:37 AM

హనీమూన్ ట్రిప్ అంటే చాలు.. ఎంతో ఉరకళెత్తుకునే ఆనందం ఏ జంటలోనైనా కనిపిస్తుంది. అయితే ఈ టూర్‌లలో చాలా మంది హ్యాపీగా గడిపినా కొంత మందికి మాత్రం ఏదో ఒక చేదు అనుభవం తప్పదు. అందులో ముఖ్యంగా టూర్‌లో భాగంగా ఎదో ఒకటి పొగొట్టుకోవడం.. లేదా.. స్వల్ప ప్రమాదాలకు గురవ్వడం జరుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు వారికి టూర్ వచ్చిన హ్యాపినెస్ కోల్పోతుంటారు. అందుకు కారణం.. టూర్ ఖర్చులతో పాటుగా అదనంగా మరిన్ని ఖర్చులు అవుతున్నాయన్న భావన. […]

హానీమూన్‌ టూర్‌కి బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రొటక్షన్..!
Follow us on

హనీమూన్ ట్రిప్ అంటే చాలు.. ఎంతో ఉరకళెత్తుకునే ఆనందం ఏ జంటలోనైనా కనిపిస్తుంది. అయితే ఈ టూర్‌లలో చాలా మంది హ్యాపీగా గడిపినా కొంత మందికి మాత్రం ఏదో ఒక చేదు అనుభవం తప్పదు. అందులో ముఖ్యంగా టూర్‌లో భాగంగా ఎదో ఒకటి పొగొట్టుకోవడం.. లేదా.. స్వల్ప ప్రమాదాలకు గురవ్వడం జరుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు వారికి టూర్ వచ్చిన హ్యాపినెస్ కోల్పోతుంటారు. అందుకు కారణం.. టూర్ ఖర్చులతో పాటుగా అదనంగా మరిన్ని ఖర్చులు అవుతున్నాయన్న భావన. అయితే ఇక ఇలా హనీమూన్ ట్రిప్ వెళ్లే వారికి హ్యాపీగా వెళ్లిరండంటుంది బజాజ్ ఫైనాన్స్. ఇక మీరు చేసే టూర్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. మా ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని చెబుతుంది.

హానీమూన్‌ పర్యటనకు సంబంధించి అన్ని రకాల కవరేజీలతో కూడిన.. కొత్త ప్లాన్‌లను బజాజ్‌ ఫైనాన్స్‌ ఆవిష్కరించింది. ఇందులో రూ.699 ప్రీమియంకు రూ.3 లక్షల కవరేజీ పొందొవచ్చు. దీనిలో భాగంగా పర్యటన సమయంలో ఏవైనా ఊహించని ఘటనలు జరిగితే.. కవరేజీ పొందొచ్చని తెలిపింది. అంటే.. టూర్‌ సమయంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా.. లేదా డబ్బు పొగొట్టుకున్నా.. క్రెడిట్ కార్డులు కోల్పోయినా.. మీకు సహాయం చేస్తుంది. అంతేకాదు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, హానీమూన్‌ టూర్‌లో ఉన్న సమయంలో ఇళ్లలో దొంగతనాల కారణంగా ఎదురయ్యే నష్టానికి ఈ ప్లాన్‌ కింద పరిహారం పొందొచ్చని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఇది దేశీయ ట్రిప్పులకే కాదు.. విదేశీ హనీమూన్ ట్రిప్స్‌కు కూడా ఉండనుంది.