Bajaj Freedom 125 CNG: బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు

|

Jul 19, 2024 | 4:00 PM

భారతదేశంలో కూడా ఈవీ వాహనాలు ప్రజలు ఇష్టపడుతున్నా పెట్రో వాహనాల సేల్స్‌ను ఢీకొట్టేలా అమ్మకాలు జరగడం లేదు. ముఖ్యంగా ఈవీ వాహనాలకు చార్జింగ్ ఎలా? అనే సమస్యతో చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు ప్రముఖ కంపెనీ బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125ను కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమైనట్లు పేర్కొంది.

Bajaj Freedom 125 CNG: బజాజ్ సీఎన్‌జీ బైక్ డెలివరీలు షురూ.. ఆ విషయంలో ప్రత్యేక రికార్డు
Bajaj Freedom 125 Cng
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు తమ హవాను చూపుతున్నాయి. అయితే భారతదేశంలో కూడా ఈవీ వాహనాలు ప్రజలు ఇష్టపడుతున్నా పెట్రో వాహనాల సేల్స్‌ను ఢీకొట్టేలా అమ్మకాలు జరగడం లేదు. ముఖ్యంగా ఈవీ వాహనాలకు చార్జింగ్ ఎలా? అనే సమస్యతో చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు ప్రముఖ కంపెనీ బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్ సైకిల్ ఫ్రీడమ్ 125ను కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఈ సీఎన్‌జీ బైక్ బైక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుందని వారంలోపే దాదాపు 30,000కు పైగా ఈ బైక్ గురించి షోరూమ్స్‌లో ఎంక్వైరీలు చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బజాజ్ ఫ్రీడమ్-125 బైక్ మూడు వేరియంట్లలో వస్తుంది. డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే వేరియంట్స్‌లో లభ్యం అవుతాయి. ఈ బైక్ ధరలు రూ. 95,000 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే గరిష్టంగా రూ. 1.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ బైక్‌ను మొదట మహారాష్ట్ర, గుజరాత్లలో మాత్రమే ప్రారంభించాలని అనుకున్నారు. అయితే బజాజ్ అధిక డిమాండ్ కారణంగా దేశవ్యాప్తంగా బుకింగ్లను ప్రారంభించింది. ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్ కోసం కంపెనీ 30,000 కంటే ఎక్కువ మంది ఎంక్వైరీ చేశారంటే ఈ బైక్ డిమాండ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రీడమ్ 125 సాంప్రదాయ పెట్రోల్ బైక్లతో పోలిస్తే, ఇది గణనీయంగా తక్కువ నిర్వహణ ఖర్చులను (50% వరకు తగ్గింపు), 26.7% తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలతో పర్యావరణ హితంగా వస్తుంది. అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందజేస్తూ ఫ్రీడమ్ 125 కేవలం 2 కిలోల సీఎన్‌జీతో 200 కి.మీల పరిధిని కలిగి ఉంది. అలాగే ఈ బైక్ ఇది 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో రావడంతో మొత్తం పరిధిని ఆకట్టుకునే 330 కి.మీలకు ఉంటుంది.

ఇంధన సామర్థ్యానికి మించి మోనో-లింక్డ్ సస్పెన్షన్, విశాలమైన సీటు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ మోటార్ సైకిల్ రైడర్ సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఫ్రీడమ్ 125కు సంబంధించిన మొదటి యూనిట్ పూణేలోని షోరూమ్‌లో డెలివరీ చేశారు.  బజాజ్ ఫ్రీడమ్ 125  సాంప్రదాయ పెట్రోల్ బైక్లతో పోలిస్తే గణనీయమైన నిర్వహణ ఖర్చులను ఆదా చేస్తుందని బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే బైక్ డెలివరీ సందర్భంగా వ్యాఖ్యానించారు. బైక్ డెలివరీలను మరింత విస్తరించడం ద్వారా వినియోగదారుల డిమాండ్‌ను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి