AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Foods: బాబా రాందేవ్ కంపెనీ పతంజలి రికార్డు బద్దలు.. అదేంటో తెలుసా..?

Patanjali Foods: పతంజలి ఫుడ్స్ తన మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకుంది. అలాగే కస్టమర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మార్కెటింగ్‌పై చాలా డబ్బు ఖర్చు చేసింది. బాబా రామ్‌దేవ్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో ప్రకటనలు, అమ్మకాల ప్రమోషన్ కోసం తన మొత్తం ఖర్చులలో 2.5 శాతం ఖర్చు..

Patanjali Foods: బాబా రాందేవ్ కంపెనీ పతంజలి రికార్డు బద్దలు.. అదేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 11, 2025 | 9:46 AM

Share

బాబా రాందేవ్ కు చెందిన FMCG కంపెనీ పతంజలి ఫుడ్స్, రోజువారీ వినియోగ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఆదాయ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ నికర లాభం 71.29 శాతం పెరిగి రూ.370.93 కోట్లకు చేరుకుంది. ఈ సమాచారాన్ని కంపెనీ సోమవారం స్టాక్ మార్కెట్‌కు అందించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.216.54 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,103.13 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.7,910.70 కోట్లుగా ఉంది. ఈ కాలంలో కంపెనీ వ్యయం రూ.8,652.53 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.7,651.51 కోట్లుగా ఉంది.

ఇది కూడా చదవండి: No Fly List: 225 మందికి శిక్ష.. ఈ తప్పులు చేస్తే విమానంలో ప్రయాణించలేరు!

పతంజలి ఫుడ్ లిమిటెడ్ ప్రకారం.. దాని అతిపెద్ద ఆదాయ వనరు కుకింగ్‌ ఆయిల్‌. ఆయిల్‌ ద్వారా అతని ఆదాయంలో భారీ పెరుగుదల ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయంలో రూ.6,717 కోట్లు వంట నూనెల విభాగం నుండే వచ్చాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య రూ. 5,483 కోట్లు కాగా, ఈసారి ఈ ఆదాయం 23 శాతం పెరిగింది.

కంపెనీ ఖర్చు గురించి చెప్పాలంటే, పతంజలి ఫుడ్స్ తన మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చుకుంది. అలాగే కస్టమర్లలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మార్కెటింగ్‌పై చాలా డబ్బు ఖర్చు చేసింది. బాబా రామ్‌దేవ్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో ప్రకటనలు, అమ్మకాల ప్రమోషన్ కోసం తన మొత్తం ఖర్చులలో 2.5 శాతం ఖర్చు చేసింది. గత 10 త్రైమాసికాల్లో ఖర్చు చేసిన అత్యధిక మొత్తం ఇది. కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ల కోసం స్టార్ల విషయానికొస్తే.. ప్రస్తుతం పతంజలి తన ప్రమోషన్‌ను శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, ఎంఎస్ ధోని, భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ ద్వారా చేస్తున్నారు.

పతంజలి ఫుడ్స్ తనకు లాభాలను ఆర్జించడమే కాకుండా గతంలో తన పెట్టుబడిదారులకు బంపర్ లాభాలను అందించింది. పతంజలి ఫుడ్స్ పెట్టుబడిదారులకు 19 శాతం రాబడిని అందించగా, 5 సంవత్సరాలలో కంపెనీ 78 శాతం బంపర్ రాబడిని ఇచ్చింది. ప్రస్తుతం ఆ కంపెనీ షేర్లు రూ.1,854 వద్ద ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: మరో రంగంలోకి ప్రవేశించిన ముఖేష్‌ అంబానీ.. దీని ధర కేవలం రూ.10

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు షాకింగ్‌.. రికార్డ్‌ స్థాయిలో బంగారం ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి