Ayushman vay vandana: పేదల ఆరోగ్యాన్నికి కేంద్రం భరోసా.. వారికి రూ.5 లక్షల ఉచిత బీమా
సాధారణంగా వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే లేవలేని వయస్సులో ఉన్న వారికి లక్షలు పెట్టి వైద్యం చేయించడం ఎందుకు? అని ఆలోచించే వారు ఉంటారు. అలాగే లక్షల్లో వైద్యానికి ఖర్చు చేయలేని నిరుపేదలు ఉంటారు. ఈ నేపథ్యంలో వృద్ధుల ఆరోగ్య భరోసాకు కేంద్రం ప్రభుత్వ ప్రధాన మంత్రి వయో వందన స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ పథకంలో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో? ఓసారి తెలుసుకుందాం.

వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వంఆయుష్మాన్ వయో వందనను ప్రారంభించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 2024లో ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి, సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా వార్షిక నగదు రహిత ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు అందిస్తుంది. వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడానికి, వృద్ధ పౌరులపై ఆర్ధిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
అర్హత వివరాలివే
70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని భారతీయ పౌరులు ఆయుష్మాన్ వయో వందనకు ఆటోమెటిక్‌గా అర్హత వస్తుంది. ముఖ్యంగా, ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై పథకం కింద ఇప్పటికే నమోదు చేసుకున్న లబ్ధిదారులు అదనంగా రూ. 5 లక్షలను టాప్-అప్ పొందుతారు. ప్రైవేట్ లేదా ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాలను కలిగి ఉన్నవారు వారి ప్రస్తుత కవరేజ్ లేదా కొత్త పథకం మధ్య ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ముందుగా ఉన్న పరిస్థితులకు మినహాయింపులు లేవు. కవరేజ్ మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఏవీవీసీలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి 27 స్పెషాలిటీలలో 1,961 కంటే ఎక్కువ వైద్య సదుపాయాలు పొందవచ్చు. హిమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, మొత్తం తుంటి, మోకాలి మార్పిడి వంటి మేజర్ చికిత్సలు పొందవచ్చు. అలాగే పీటీసీ ఎడయాగ్నస్టిక్ యాంజియోగ్రామ్, సింగిల్, డ్యూయల్-ఛాంబర్ పేస్మేకర్ ఇంప్లాంటేషన్ల వంటి చికిత్సలు తీసుకోవచ్చు.
వయో వందన కార్డు కోసం నమోదు ఇలా
- వయో వందన కార్డు కోసం రిజిస్ట్రేషన్ డిజిటల్, యూజర్ ఫ్రెండ్లీ, ఆయుష్మాన్ భారత్ యాప్ ఉపయోగించి నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆయుష్మాన్ భారత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- లబ్ధిదారుడు లేదా ఆపరేటర్ లాగిన్‌ను ఎంచుకోవలాి.
- మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, ప్రామాణీకరణ మోడ్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి కాప్చా పూర్తి చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
- రాష్ట్రంతో పాటు ఆధార్ వివరాలతో లబ్దిదారుడి వివరాలను నమోదు చేసి,న ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీను పూర్తి చేయాలి.
- అనంతరం ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి ధ్రువీకరించాలి.
- పిన్ కోడ్, కుటుంబ సభ్యుల వివరాలను సమర్పించాలి.
- ఈ-కేవైసీ ఆమోదం పొందిన తర్వాత ఆయుష్మాన్ వే వందన కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఒకసారి కార్డు జారీ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా 30,072 ఆసుపత్రులలో నగదు రహిత ఆరోగ్య సంరక్షణను పొందేందుకు వీలు కల్పిస్తుంది. దాదాపు 13,352 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సాయం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




