I Phones: ఆ విషయంలో చైనాను అధిగమించిన భారత్.. ఎగుమతుల్లో రికార్డుల వరద
భారతదేశంలో తయారీ రంగంలో రోజురోజుకూ విస్తరిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ నేపథ్యంలో టాప్ కంపెనీలు కూడా తమ ప్రొడెక్ట్స్ తయారీను భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఆపిల్ తన ఐఫోన్ తయారీను భారత్‌లో విస్తరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎగుమతుల్లో చైనాను భారత్ అధిగమించింది.

ఐఫోన్ ఎగుమతుల్లో భారతదేశం చైనాను అధిగమించింది. ముఖ్యంగా అమెరికాలో భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఐఫోన్ ప్రొడెక్ట్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని నివేదికల్లో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలో ఐఫోన్ ప్రొడెక్ట్స్ ఎగుమతులు సంవత్సరానికి 76 శాతం వృద్ధిని సాధించాయి. ఈ అభివృద్ధికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై విధించిన 30 శాతం పరస్పర సుంకం కారణమని నిపుణులు స్పష్టం చేస్తుంది. ట్రంప్ నిర్ణయంతో భారతదేశం నుంచి అమెరికన్ మార్కెట్‌కు ఐఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి. భారతదేశం ఏప్రిల్‌లో దాదాపు 3 మిలియన్ ఐఫోన్‌లను (లేదా 30 లక్షల యూనిట్లు) అమెరికాకు ఎగుమతి చేసింది అయితే చైనా నుంచి ఈ షిప్‌మెంట్‌లు కేవలం 9,00,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.
2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఎక్స్‌పోర్ట్ చెయిన్‌లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఆపిల్ చైనా బయటి దేశాల్లో తయారీ కార్యకలాపాలను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న భారత్ దేశంలో ఐఫోన్ ఉత్పత్తుల తయారీకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. దీంతో చైనా తర్వాత ఐఫోన్ ఉత్పత్తికి దేశాన్ని రెండవ అతిపెద్ద కేంద్రంగా నిలిపింది. అలాగే ఏప్రిల్ 2 నుంచి అమెరికాలో చైనా నుంచి ఐఫోన్‌లపై అమలు చేసిన 30 శాతం సుంకం భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి దిగుమతులపై మరింత అనుకూలమైన 10 శాతం సుంకానికి భిన్నంగా ఉంటుందని నిపునులు చెబుతున్నారు.
జూన్ త్రైమాసికం నుంచి భారతదేశంలో తయారైన ఐఫోన్‌లు యూఎస్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ధ్రువీకరించారు. అయితే ఆశాజనకమైన వృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలికం కావచ్చని పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూఎస్ ఐఫోన్‌ల డిమాండ్ ప్రతి త్రైమాసికంలో 20 మిలియన్ యూనిట్ల వరకు ఉంది. కానీ భారతదేశం 2026 వరకు ఈ లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చని చెబుతున్నారు. ఆపిల్ భారతదేశంలో దాని తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి కృషి చేస్తుండగా ఉత్పత్తి ఎంత పెరగవచ్చనే దానిపై పలు పరిమితులు ఉండడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




