Fixed Deposit: బ్యాంకింగ్ రంగాలలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Bank Fixed Deposit)లో మంచి వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎఫ్‌డీ (FD)లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారికి మంచి వడ్డీ రేట్లను పొందవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ (Senior Citizen)కు అధిక లాభాలు ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లపై వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. గత కొన్ని రోజులుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఇక తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది యాక్సిస్ బ్యాంకు. అయితే ఈ వడ్డీ రేట్లు 2 కోట్లకు తక్కువ డిపాజిట్లకు వర్తించదు. 18 నెలల నుంచి 2 ఏళ్ల కంటే తక్కువ కాలవ్యవధిలో టర్మ్ డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సవరించిన వడ్డీ రేట్లు:
ఇవి కూడా చదవండి: