Axis Bank Jobs: పట్టణాల్లో విద్యావంతులైన(Educated) మహిళల భాగస్వామ్యం ఉద్యోగాల్లో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. మళ్లీ తిరిగి ఉద్యోగం చేయాలనుకునే మహిళలకోసం యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేకంగా ఒక అవకాశాన్ని కలిగిస్తోంది. ‘హౌస్‌వర్క్‌ఇస్‌వర్క్'(HouseWorkIsWork) పేరుతో మళ్లీ వృత్తి జీవితాన్ని ప్రారంభించాలనుకునే మహిళలకు చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తీసుకురావటానికి అసలు కారణం మహిళలు తిరిగి ఉద్యోగం చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపటానికేనని బ్యాంకింగ్ దిగ్గజం వెల్లడించింది. మహిళలు తమకు ఉండే స్కిల్స్ తో బ్యాంకింగ్ రంగంలోని వివిధ ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహించగలని.. తద్వారా వారు తిరిగి ఉద్యోగం జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారని బ్యాంక్ ప్రెసిడెంట్ రాజ్ కమల్ వెంపటి పేర్కొన్నారు.
ఇలా బ్యాంకింగ్ రంగంలో అనుభవంలేని మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవటం ఒక ఛాలెంజింగ్ పని అని ఆమె అభిప్రాయపడ్డారు. బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా పనిచేయగల వారికి ఎంపిక ద్వారా పట్టణాల్లో పనిచేయని మహిళలకు మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. దీనిని రూపకల్పన చేయటానికి పల్లవి శర్మ అనే ఒక ఉద్యోగిని ఆదర్శమని ఆమె తెలిపారు. ఇంటిపనులు చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, ఇంటి ఆర్థిక లావాదేవీలను చక్కబెడుతూ.. ఇలా ఒకేసారి అన్ని పనులూ చేయగనని ఆమె రెజ్యూమ్ లో పెట్టిన వివరాల నుంచి ఈ ఆలోచన పుట్టిందని తెలిపారు. దీనికి అందరి నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. కేవలం బ్రాంచ్ కు వచ్చి పనిచేసే ఉద్యోగాలకే కాకుండా.. తమ సంస్థలో అందుబాటులోని అన్ని రకాల ఉద్యోగాల్లో మహిళలకు ఈ అవకాశం అందిస్తున్నట్లు కంపెనీ హెచ్ ఆర్ తెలిపారు.
ఇప్పటి వరకూ దీని ద్వారా తమకు 3000 ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. బ్యాంకులోని రెగ్యులర్ ఉద్యోగులకు అందించే అన్ని ప్రయోజనాలు వీరికి కూడా లభిస్తాయని బ్యాంక్ తెలిపింది. జీతాల అంశం వారి అనుభవం, స్కిల్స్ పై అధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి..
Multibagger Penny Stocks: రూ. లక్షను.. రూ. 2 కోట్లు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..
Gold Silver Price Today: మహిళలకు షాకింగ్.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు