Axis Bank: ఖాతాదారులకు షాక్‌ ఇచ్చిన యాక్సిక్‌ బ్యాంక్.. ఇక బాదుడే బాదుడు..

|

May 30, 2022 | 7:23 AM

యాక్సిస్ బ్యాంక్(Axis Bank) తమ ఖాతాదారులకు షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఛార్జీలను పెంచింది. మినిమమ్‌ బ్యాలెన్స్‌(minimum balence) లిమిట్‌ను పెంచేసింది. దీనికి సంబంధించి యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు సందేశం పంపుతోంది...

Axis Bank: ఖాతాదారులకు షాక్‌ ఇచ్చిన యాక్సిక్‌ బ్యాంక్.. ఇక బాదుడే బాదుడు..
Axis Bank
Follow us on

యాక్సిస్ బ్యాంక్(Axis Bank) తమ ఖాతాదారులకు షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంక్ ఛార్జీలను పెంచింది. మినిమమ్‌ బ్యాలెన్స్‌(minimum balence) లిమిట్‌ను పెంచేసింది. దీనికి సంబంధించి యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు సందేశం పంపుతోంది. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు విధించనున్నట్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. సేవింగ్స్ ఖాతా(saving account), జీతం ఖాతాలపై బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సర్వీస్ ఛార్జీలు పెంచారు. నెలలో కనీస నిల్వను ఖాతాలో ఉంచకపోతే ఛార్జీలు విధిస్తారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో నెలవారీ కనీస నిల్వను రూ.15,000 నుండి రూ.25,000కి పెంచారు. NACH కింద ఆటో డెబిట్ విఫలమైతే ఛార్జీ కూడా పెంచారు. జూలై 1 నుంచి ఈ ఛార్జీ వర్తిస్తుంది. మెట్రో నగరాల్లో కనీస నిల్వ లేకుంటే రూ.500కి బదులు రూ.600 వసూలు చేస్తారు. ఈ రేటు పట్టణాల్లో రూ.300, గ్రామాల్లో రూ.250కి తగ్గించారు.

ఆటో డెబిట్ ఫెయిల్యూర్ ఛార్జీ రూ.200 నుంచి రూ.250కి పెంచారు. మీరు చెక్‌లో అదనపు పేజీని తీసుకుంటే మొదటి రూ. 2.50కి బదులుగా, మీరు 4 రూపాయలు చెల్లించాలి. మొదటి సారి NACH రిటర్న్ రూ.375, రెండోసారి రూ.425, మూడోసారి రూ.500 వసూలు చేస్తారు. చెక్ బుక్, NACH ఆటో డెబిట్ కొత్త నియమం జూలై 1 నుంచి వర్తిస్తుంది. పాస్‌బుక్, డూప్లికేట్ పాస్‌బుక్‌ల భౌతిక వివరాల చార్జీని రూ.75 నుంచి రూ.100కి పెంచారు. NACH అనేది రెండు బ్యాంకుల మధ్య డబుల్ ధృవీకరణ లేకుండా ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ. ఇందులో తక్కువ, అధిక విలువ గల ఫండ్ బదిలీలు రెండూ ఆటోమేటిక్‌గా ఉంటాయి. మీరు ఆరోగ్య బీమా తీసుకున్నారనుకోండి. దానిని Axis బ్యాంక్ NACH సేవతో లింక్ చేసారనుకోండి. అప్పుడు బీమా ప్రీమియం గడువు తేదీలో స్వయంచాలకంగా తీసివేయబడుతుంది.

ఇవి కూడా చదవండి