కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..

|

Apr 29, 2021 | 11:29 AM

Axis Bank: దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. తాజాగా ఈ బ్యాంక్ తన కస్టమర్లకు షాకిచ్చింది.

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..
Axis Bank
Follow us on

Axis Bank: దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. తాజాగా ఈ బ్యాంక్ తన కస్టమర్లకు షాకిచ్చింది. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న సమయంలో తమ కస్టమర్లకు ఆ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. పలు చార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులో అకౌంట్ ఉన్న వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. నెలకు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండనివారు ఇకపై ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి మంత్లీ బ్యాలెన్స్ రూ.15 వేలు కలిగి ఉండాలి. ప్రస్తుతం ఇది రూ.10 వేలుగా ఉంది. అలాగే ప్రైమ్, లిబర్టీ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారికి మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ వరుసగా..రూ.25వేలు, రూ.15 వేలుగా ఉన్నాయి. (Service Charges)

ఒకవేళ బ్యాంక్ కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండకపోతే.. రూ.10 నుంచి రూ.100 వరకు చార్జీలు చెల్సించాల్సి ఉంటుంది. (SMS Charges) అయితే బ్యాంక్ మినిమమ్ చార్జీని రూ.150 నుంచి రూ.50 వరకు తగ్గించింది. అదే సమయంలో గరిష్ట చార్జీలను రూ.600 నుంచి రూ.800కు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మీరు మే 1 నుంచి మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.5000 నుంచి రూ.75000 ఉండాలనుకుంటే.. అప్పుడు మీరు బ్యాంకుకు రూ.800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. (Cash Withdraw Charges) హెచ్‏డీఎఫ్‏సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల కన్నా ఈ చార్జీలు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే నెలకు 4 ఉచిత క్యాష్ విత్ డ్రాయల్ లిమిట్ దాటితే వచ్చే నెల నుంచి రూ.1000కి రూ.10 చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం రూ.5గా ఉంది. అలాగే బ్యాంక్ ఎస్ఎంఎస్ చార్జీలను కూడా మార్చింది. నెలకు రూ.5 కాకుండా.. ప్రతి ఎస్ఎంఎస్ కు 25 పైసలు వసూలు చేయనుంది. ఈ చార్జీల పెంపు విధానం మే 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Also Read: Cowin Server: కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..