AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంపు.. బిల్లు కట్టకపోతే బాదుడే..

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి షాక్ తగిలింది. ఆ బ్యాంకు డీసీసీతో పాటు బిల్లు బకాయిలపై విధించే లేట్ ఫీజులను సవరించింది. గతంలోనే ఉన్న ఛార్జీలను మరింత పెంచింది. అలాగే ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి మార్పులు చేసింది. వీటి వివరాలు చూస్తే..

Credit Card: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంపు.. బిల్లు కట్టకపోతే బాదుడే..
Axis Bank
Venkatrao Lella
|

Updated on: Aug 22, 2026 | 12:49 PM

Share

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి షాక్ తగిలింది. యాక్సిస్ బ్యాంక్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆగస్ట్ 28వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. డీసీసీ ఛార్జీలను పెంచడంతో పాటు చెల్లించని బ్యాలెన్స్‌పై విధించని లేట్ ఫీజులను కూడా సవరించారు. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుంటే వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్, గిఫ్ట్ కార్డ్స్, అంతర్జాతీయ లావాదేవీల కోసం ఈ కార్డు వాడుతుంటే తప్పనిసరిగా ఈ మార్పులను తెలుసుకోవాలి. పెండింగ్ బకాయిలపై విధించే ఆలస్య రుసుంలు. డైనమిక్ కరెన్సీ మార్పిడి మార్కప్‌లు, గిఫ్ట్స్ కార్డ్స్‌కి సంబంధించిన నియమాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే..

రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బకాయిలు ఉంటే ఇక నుంచి రూ.1300 లేట్ ఫీజును వసూలు చేయనుంది. రూ.50 వేల కంటే తక్కువ ఉంటే ఆలస్య రుసుం యథాతధంగా ఉంటుంది. బకాయి మొత్తం రూ.500 ఉంటే ఎలాంటి ఆలస్య రుసుం ఉండదు. ఇక రూ.501 నుంచి రూ.5 వేల వరకు ఉంటే రూ.500 ఛార్జీ, రూ.5001 నుంచి రూ.10 వేల వరకు ఉంటే రూ.750 ఛార్జీలు, రూ.10,001 నుంచి రూ.50 వేల వరకు ఉంటే రూ.1200 చార్జీలు ఉంటుంది. ఆపైన రూ.1300 ఆలస్యపు చార్జీ ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చెల్లింపులు చేసినప్పుడు.. మీ బకాయి మొత్తంలోని వివిధ భాగాలకు ఒక నిర్దిష్ట క్రమంలో వర్తింపచేస్తారు. చెల్లింపులు మొదట ఫీజులు, ఛార్జీలకు (పన్నులతో సహా), ఆ తర్వాత సమాన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు), వడ్డీ ఛార్జీలు, కొనుగోళ్లు, నగదు అడ్వాన్స్‌లకు వర్తింపచేస్తారు.

ఆగస్ట్ 28 నుంచి మార్పులు..

ఇక నుంచి దేశీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి మాగ్నస్ క్రెడిట్ కార్డుపై ఉన్న ప్రయారిటీ పాస్ చెల్లదు, ఇమ్మిగ్రేషన్ తర్వాత భారతీయ అంతర్జాతీయ టెర్మినల్స్‌లోని విమానాశ్రయ లాంజ్‌లు అంతర్జాతీయ లాంజ్‌లుగా పరిగణించబడతాయి. దీంతో ప్రయారిటీ పాస్‌ను ఉపయోగించి వాటిని యాక్సెస్ చేయవచ్చని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇక గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లు వంటివి రివార్డ్స్ కేటగిరీ పరిధిలోకి రావు. ఆగస్ట్ 28 నుంచి వీటిపై ఎలాంటి రివార్డులు లేదా క్యాష్‌బ్యాక్ లభించవు. వీటిని ‘వాలెట్’ ఖర్చుల కేటగిరీ కింద వర్గీకరించడానికి బదులుగా.. ‘గిఫ్ట్ కార్డ్స్’ అనే ప్రత్యేక ఖర్చుల కేటగిరీ కింద తిరిగి వర్గీకరిస్తామని బ్యాంక్ తెలిపింది.

Follow Us