Auto Tips: మీ వాహనంలో ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోల్‌ వేయిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోవాల్సిందే!

Auto Tips: కంపెనీ నిర్దేశించిన పరిమితి వరకు ఇంధనం నింపడంలో ఎప్పుడూ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు కారులో ఇంధనం నింపడానికి పరిమితి ఏమిటో తెలుసుకోవాలి. తదుపరిసారి మీరు మీ కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపినప్పుడు మొదటి ఆటో కట్..

Auto Tips: మీ వాహనంలో ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోల్‌ వేయిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోవాల్సిందే!

Updated on: Nov 03, 2025 | 6:10 PM

Auto Tips: సాధారణంగా చాలా మంది కారులో గానీ, బైక్‌లో గానీ పెట్రోల్‌ వేస్తే ఫుల్‌ ట్యాంక్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఒక్కసారి ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే చాలా రోజుల వరకు వస్తుందని భావిస్తుంటారు. ముఖ్యంగా ధరలు పెరుగుతున్నప్పుడు లేదా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఫుల్‌ ట్యాంక్‌ చేయిస్తుంటారు. కానీ కారులోని ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపడం సరైనదేనా లేదా అలా చేయడంలో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

వివిధ కంపెనీల కార్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం మారుతూ ఉంటుంది. కొన్ని కార్లలో 25 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ నింపవచ్చు. కొన్ని కార్లలో ఇంధన ట్యాంక్ సామర్థ్యం 35 లీటర్ల వరకు ఉంటుంది. అయితే కారు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపడం సరైనది కాదు. మీరు కారు కంపెనీ సిఫార్సు చేసినంత పెట్రోల్ లేదా డీజిల్‌తో కారును నింపవచ్చు. కంపెనీ సూచించిన పరిమితి కంటే ఎక్కువ ఇంధనాన్ని కారులో నింపడం వల్ల నష్టం జరగవచ్చంటున్నారు టెక్‌ నిపుణులు.

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్ నుంచి పన్ను లేకుండా ఎంత బంగారం తీసుకురావచ్చు? పరిమితికి మించితే జరిమానా ఎంత?

ఇవి కూడా చదవండి

కంపెనీ నిర్దేశించిన పరిమితి వరకు ఇంధనం నింపడంలో ఎప్పుడూ సమస్య ఉండదు. ఇప్పుడు మీరు కారులో ఇంధనం నింపడానికి పరిమితి ఏమిటో తెలుసుకోవాలి. తదుపరిసారి మీరు మీ కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపినప్పుడు మొదటి ఆటో కట్ ఎప్పుడు జరిగిందో గుర్తుంచుకోండి. మొదటి ఆటో కట్ తర్వాత కారులో ఇంధనం నింపవద్దు. దీని వల్ల ఎటువంటి హాని జరగదు. ఇది సురక్షితమైన ఉత్తమ మార్గం.

కారులో పూర్తిగా ఇంధన ట్యాంక్ ఉండటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు కారు కదులుతున్నప్పుడు గుంతలు లేదా బ్రేక్‌ల కారణంగా అది వాహనం కదిలినప్పుడు ట్యాంకులో ఉండే ఇంధనం కూడా కుదుపులకు లోనవుతుంది. అటువంటి పరిస్థితిలో సస్పెన్షన్ కారణంగా ఇంధనం పైకి క్రిందికి కదులుతుంది. ఇంధన ట్యాంక్ నిండి ఉంటే, పెట్రోల్ లేదా డీజిల్ కదలడానికి స్థలం ఉండదు. దీనివల్ల అది బయటకు లీక్ అవుతుంది. ముఖ్యంగా కారు వాలుపై ఉంటే లేదా వాలుపై పార్క్ చేస్తే, పెట్రోల్ లేదా డీజిల్ లీక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల ప్రమాదం ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు. అందుకే మీరు పెట్రోల్‌ లేదా డీజిల్‌ నింపెటప్పుడు ఫుల్‌ ట్యాంక్‌ చేయకుండా కొంత గ్యాప్‌ ఉంచడం మంచిది. మీ వాహనంలో ఇంధనాన్ని నింపిన ప్రతిసారీ ట్యాంక్‌ను 10 శాతం ఖాళీగా ఉంచాలని ఆటో నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: PAN Card: డిసెంబర్‌ వరకే గడువు.. ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

అయితే వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపడం వల్ల పెద్దగా సమస్యలు ఉండకపోయినా కొన్ని సందర్భాల్లో ట్యాంక్ నిండినప్పుడు పొంగి పొర్లి ఇంధనం వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగే, ట్యాంక్ పూర్తి సామర్థ్యం కంటే ఎక్కువ నింపితే కొన్ని వాహనాలలో ఇంధన సెన్సార్లలో సమస్యలు రావచ్చంటున్నారు. కొన్ని వాహనాలలో ట్యాంక్ పూర్తిగా నింపినప్పుడు ఇంధన సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీని వలన ఇంధన స్థాయిని సూచించే మీటర్ సరిగ్గా చూపించకపోవచ్చు.

‘చెక్ ఇంజిన్’ లైట్:

కొన్ని వాహనాలలో ట్యాంక్ ఓవర్‌ఫిల్ చేసినప్పుడు ‘చెక్ ఇంజిన్’ లైట్ వెలుగుతుంది. ఇది సాధారణంగా ఇంధన వ్యవస్థలో ఏదైనా సమస్య ఉందని సూచిస్తుంది. చాలా పెట్రోల్ పంపులు స్వయంచాలకంగా నింపడం ఆపేస్తాయి. అందుకే మీరు ట్యాంక్‌ను ఓవర్‌ఫిల్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఇంజిన్‌ పనితీరు తగ్గుతుంది:

పెట్రోల్ లేదా డీజిల్ నుంచి వచ్చే ఆవిరికి ఫ్యూయల్ ట్యాంక్ లోపల వాక్యూమ్ కూడా అవసరం. ట్యాంక్‌ను పూర్తిగా నింపిన తర్వాత పెట్రోల్‌కు ఆ వాక్యూమ్ లభించదు. దీని కారణంగా ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. అప్పుడు కాలుష్యం కూడా పెరుగుతుంది. మోటార్‌సైకిల్‌ ట్యాంక్‌ పూర్తిగా నిండిపోయి పార్కింగ్‌ చేస్తున్నప్పుడు దాన్ని వంచి సైడ్‌ స్టాండ్‌పై పెడితే లీకేజీ అయ్యే అవకాశం ఉందని దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: దేశంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ స్లీపర్ రైలు.. పట్టాలపై ఎప్పుడంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి