
వివిధ రకాల డిపాజిట్లపై బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వినియోగదారులకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని మళ్లీ పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై, సాధారణ ప్రజలకు ఇప్పుడు 3.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు 7.70 శాతం నుంచి 4.25 శాతం వడ్డీ పొందుతారు. 24 నెలల ఒక రోజు నుంచి 36 నెలల వరకు ఎఫ్‌డీలపై గరిష్టంగా 8 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది. మే 15 నుంచి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
ప్రైవేట్ రంగంలోని ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ ఎకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త రేట్లు మే 17 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ ప్రజలకు ఎఫ్‌డీపై గరిష్టంగా 7.25% వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్‌లకు సగం శాతం ఎక్కువ రాబడి లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ సేవింగ్స్ ఎకౌంట్స్ లో లభించే వడ్డీ రేటు రెపో రేటుతో ముడిపడి ఉంటుంది. అందుకే రెపో రేటులో హెచ్చుతగ్గుల కారణంగా ఇది కూడా మారుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి