ATM కార్డులను ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకుంటే మోసపోతారు..

|

Jul 24, 2022 | 5:41 PM

ఏటీఎం ఉంటే.. బ్యాంకులో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి గంటల కొద్ది నిలబడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి స్లిప్ నింపాల్సిన అవసరం కూడా లేదు.

ATM కార్డులను ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేకుంటే మోసపోతారు..
ATM Safety Tips
Follow us on

ATM Safety Tips: నేటి కాలంలో దాదాపు ప్రతి బ్యాంక్ హోల్డర్ వద్ద ATM కార్డులు ఉన్నాయి. ఏటీఎం డెబిట్ కార్డ్ నుంచి నగదు విత్ డ్రా చేయడం చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా బ్యాంకులో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి గంటల కొద్ది నిలబడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలాంటి స్లిప్ నింపాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ATMల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు కూడా వేగంగా చేయవచ్చు. అయితే ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఏటీఎం మోసాలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో దీనిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దీనికోసం ఏటీఎంలను వినియోగించే వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దీంతో ఏటీఎంల ద్వారా జరిగే మోసాలను నివారించవచ్చు. ATM భద్రతలో ఉపయోగించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ATMని ఉపయోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఇవి కూడా చదవండి
  • మీ PIN నెంబర్‌ను గుర్తుంచుకోండి. ఎక్కడా రాయవద్దు.. ముఖ్యంగా కార్డుపై ఎప్పుడూ రాయవద్దు.
  • మీ కార్డ్ మీ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే.. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కాకుండా ఎవరితోనూ మీ పిన్ లేదా కార్డ్‌ని షేర్ చేయవద్దు.
  • ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు.. మెషిన్ చాలా మంది ఉంటే.. పిన్‌ను నమోదు చేస్తున్న క్రమంలో కీప్యాడ్‌ను కవర్ చేయండి. తద్వారా మీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తులు మీ పిన్‌ను చూడలేరు.
  • ATM కార్డ్‌ని ఉపయోగించడానికి లేదా మీ నగదును నిర్వహించడానికి వేరే వ్యక్తుల (అపరిచితుల) సహాయం తీసుకోకండి.
  • ATM నుంచి బయలుదేరే ముందు క్యాన్సల్ బటన్‌ను నొక్కండి. ఇంకా కార్డ్‌తోపాటు లావాదేవీ స్లిప్‌ని కూడా తీసుకెళ్లండి. లేకుంటే స్లిప్‌ను వెంటనే చింపివేయండి.
  • మీ ATM కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా.. వెంటనే కార్డ్ జారీ చేసిన బ్యాంకుకు తెలియజేయండి.
  • మీరు మీ ATM వద్ద చెక్ లేదా కార్డ్‌ను డిపాజిట్ చేసినప్పుడు.. కొన్ని రోజుల తర్వాత మీ ఖాతాలో క్రెడిట్ ఎంట్రీని తనిఖీ చేయండి. మీరు ఏదైనా తేడాను గమనించినట్లయితే బ్యాంకుకు నివేదించండి.
  • మీ కార్డ్ ATMలో చిక్కుకుపోయినా లేదా అన్ని ఎంట్రీలు చేసిన తర్వాత కూడా నగదు పంపిణీ కానట్లయితే, వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..