Ather Halo Smart Helmet: ఈ హెల్మెట్ చాలా స్మార్ట్ గురూ.. పాటలు వినొచ్చు.. మాట్లాడుకోవచ్చు.. 

|

Apr 09, 2024 | 6:22 PM

అందరూ హెల్మెట్ ను ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని ప్రమాదాల్లో రక్షణనిస్తుందని, ప్రాణాలు కాపాడుతుందని వినియోగిస్తారు. అంటే హెల్మెట్ అంటే రక్షణ. అయితే ఇకపై హెల్మెట్ ను సంతోషంగా పాటలు వినడానికి, బైక్ పై వెనుక కూర్చున్న వారితో ఇబ్బంది లేకుండా మాట్లాడటానికి వినియోగించుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందిన ఈ స్మార్ట్ హెల్మెట్లు కొత్త ట్రెండ్ సృష్టిస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

Ather Halo Smart Helmet: ఈ హెల్మెట్ చాలా స్మార్ట్ గురూ.. పాటలు వినొచ్చు.. మాట్లాడుకోవచ్చు.. 
Ather Halo Smart Helmet
Follow us on

టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహించని రీతిలో విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు అవసరమైన అనేక అత్యుత్తమ ఫీచర్లతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలోని ఆధునిక స్పీకర్లు, బ్లూటూత్‌, ఆడియో సిస్టమ్‌, జీపీఎస్‌ తదితర వాటిని వినియోగదారులు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ హెల్మెట్లకు విస్తరించింది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఏథర్ వీటిని రూపొందించింది. హలో పేరుతో విడుదలైన ఈ హెల్మెట్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రాణానికి రక్షణ..

సాధారణంగా హెల్మెట్‌ అంటే తలకు ధరించే రక్షణ కవచం. ప్రయాణాల్లో దానిని ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలకు రక్షణ ఉంటుంది. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది హెల్మెట్‌ ధరించకపోవడంతోనే చనిపోతున్నారు. అందుకనే ప్రభుత్వాలు హెల్మెట్‌ వాడకాన్ని తప్పనిసరి చేశాయి. కానీ చాలామంది వాహనాచోదకులు హెల్మెట్‌ ధరించడంపై ఆసక్తి చూపించరు. అయితే హలో హెల్మెట్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేయవచ్చు.

హలో పేరుతో విడుదల..

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ సరికొత్తగా హలో పేరుతో స్మార్ట్‌ హెల్మెట్‌ను తయారు చేసింది. తమ కమ్యూనిటీ డే రోజున దేశ మార్కెట్ లోకి విడుదల చేసింది. అనేక స్మార్ట్‌ ఫీచర్లు కలిగిన దీని ధరను రూ.12,999 గా నిర్ణయించింది. అలాగే హాఫ్‌ ఫేస్‌ మాడ్యూల్‌ విభాగంలో రూపొందించిన హాలో బిట్ కూడా రూ. 4,999కు అందుబాటులో ఉంది. కమ్యూనిటీ డేలో ఉన్న వ్యక్తులు ఈ హెల్మెట్‌లపై దాదాపు 50 శాతం తగ్గింపు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకతలు ఇవే..

ఏథర్ హాలో హెల్మెట్‌ లో అనేక సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. దీనిలో హర్మాన్ కార్డాన్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నాణ్యత, స్పష్టత కలిగిన ఆడియో వస్తుంది. అలాగే వేర్‌టెక్ట్ టెక్నాలజీతో హెల్మెట్‌ ను రూపొందించారు. దీనిని రైడర్‌ ధరించగానే ఆటోమెటిక్‌ గా ఆన్ అవుతుంది. అలాగే మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రొప్రైటరీ వైర్‌లెస్ చార్జర్‌ ద్వారా హెల్మెట్‌ ను చక్కగా చార్జింగ్‌ చేసుకోవచ్చు. అది కూడా రిజ్టా స్కూటర్‌ బూట్‌ స్పేస్‌ పట్టేలా రూపొందించారు. ఒక్కసారి చార్జింగ్‌ చేసుకుంటే దాదాపు వారం రోజుల పాట బ్యాటరీ బ్యాకప్‌ వస్తుంది.

కమ్యూనికేషన్‌..

ఏథర్ హలో హెల్మెట్‌లో చిట్‌చాట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా రైడర్, అతడి వెనుక కూర్చున్న వారి మధ్య కమ్యూనికేషన్‌ చేసుకోవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. అలాగే దీనిని స్కూటర్‌కు కనెక్ట్‌ చేసే వీలు కూడా ఉంది. వాహనచోదకుడు స్కూటర్‌ ఎడమ స్విచ్‌ గేర్‌పై ఉన్న జాయ్‌ స్టిక్‌ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ హెల్మెట్‌ రెండు రంగులలో అందుబాటులో ఉంది. వీటితో పాటు ఏథర్‌ సంస్థ ఐఎస్‌ఐ, డాట్‌ రేటెడ్‌ కస్టమ్‌ హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్లను కూడా అభివృద్ధి చేసింది. ఇవి త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన స్వాప్నిల్ జైన్ తమ హలో హెల్మెట్ల ప్రత్యేకతలను వివరించారు. వాహనచోదకుడు చాలా ఉత్సాహంగా హెల్మెట్‌ ధరించడం, ఆహ్లాదకరంగా ప్రయాణాన్ని కొనగించడం కోసమే నూతన ఫీచర్లతో హలో హెల్మెట్లను రూపొందించామన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..