New Bank Rules: ఈ రోజుల్లో అన్ని లావాదేవీలు బ్యాంకుల నుంచే జరుగుతున్నాయి. అందువల్ల వీటికి సంబంధించి వస్తున్న మార్పులను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ఎక్కువ మెుత్తంలో జరిగే నగదు ట్రాన్సాక్షన్స్ పై ఆదాయపన్ను శాఖ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు లేదా అంతకు మించి చేసే డిపాజిట్లు, విత్ డ్రాలపై పాన్, ఆధార్ కార్డు తప్పని సరి చేస్తూ టాక్స్ డిపార్ట్ మెంట్ కొత్త నిబంధనలు తెచ్చింది. అయితే ఈ రూల్స్ మే 26 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై లావాదేవీలు చేసేటప్పుడు వీటిని తప్పక పాటించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తన నోటిఫికేషన్ లో వెల్లడించింది.
బ్యాంకులు, ఫోస్టాఫీసుల్లో ఇకపై జరిపే అధిక మెుత్తం లావాదేవీలు, ఇతర రకాలైనా ఖాతాలా చెల్లింపుల్లో పాన్ లేదా అధార్ వివరాలు అందించటం తప్పనిసరి. డిపాడిట్, విత్ డ్రాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి తనకుండే అన్ని బ్యాంకు ఖాతాలలో కలిపి ఈ రూ.20 లక్షల లిమిట్ దాటి చెల్లింపులు చేసినా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఒకే సారి ఇంత మెుత్తంలో చేసే చెల్లింపులకు పాన్ కార్డు తప్పక ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేవలం కమర్షియల్ బ్యాంకులు మాత్రమే కాకా పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల్లో చేసే లావాదేవీలు కూడా పరిగణలోకి వస్తాయి.
నగదు లావాదేవీల్లో ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు ఆదాయపుపన్ను చట్టంలో మార్పులు చేశారు. ముఖ్యంగా ఇటువంటి లావాదేవీలను పాన్, ఆధార్, డెమగ్రఫీ, బయోమెట్రిక్ సమాచారాన్ని సెక్షన్- 139A ప్రకారం ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కామ్ టాక్స్, డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ లేదా సదరు డిపార్ట్మెంట్ అధికారి ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది.