AI chatbots: ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నారా..? ఆ పని చేస్తే ఇబ్బందుల్లో పడినట్టే..!

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని రంగాలలో ఈ సాంకేతికతను తీసుకువచ్చారు. సైన్స్, టెక్నాలజీ, వైద్యం, టెక్నికల్ ఇలా అన్ని విషయాలపై ప్రజలకు ఎంతో సహాయ పడుతోంది. మీ ప్రశ్న ఏదైనా క్షణాల్లోనే సమాధానాలు చెబుతోంది. శరవేగంగా, సులువుగా వివిధ సమస్యలకు పరిష్కరాలు చూపుతోంది. ఇదే సమయంలో కొన్ని విషయాల్లో ఏఐతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

AI chatbots: ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నారా..? ఆ పని చేస్తే ఇబ్బందుల్లో పడినట్టే..!
Ai Chat Bot

Updated on: Jan 31, 2025 | 3:30 PM

ఏఐ విషయానికి సంబంధించిన ఆరు అంశాలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చాట్ జీపీతో పాటు మిగిలిన ఏఐ చాట్ బాట్ లతో కొన్ని విషయాలను ప్రస్తావించకూడదని తెలిపారు. ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం.. చాలామంది ప్రజలు ఆరోగ్య సంబంధ విషయాలపై ఏఐని ఎక్కువగా సంప్రదిస్తున్నారు. అది అందించే సూచనలు పాటిస్తున్నారు. ఏఐ చాట్ బాట్ లు మనతో చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. కానీ ఆరోగ్య సంబంధ విషయాల కోసం వాటిపై ఆధారపడకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు ఇలా ఆరోగ్య సలహాలు కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కింద తెలిపిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు.

వ్యక్తిగత సమాచారం

పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇ మెయిల్ అడ్రస్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ చాట్ బాట్ లతో పంచుకోకూడదు. దాని ద్వారా మిమ్మల్ని, మీ పనులను బయటి వారు ట్రాక్ చేసే ప్రమాదం ఉంటుంది.

ఆర్థిక విషయాలు

బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు తదితర వాటి నంబర్లను ఎప్పుడూ ఏఐ చాట్ బాట్ లతో ప్రస్తావించకూడదు. ఆ పిన్ నంబర్లను వాటిలో ఎంటర్ చేయకూడదు. దీని వల్ల మీ డబ్బులను దోచుకునే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

పాస్ వర్డులు

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల పాస్ వర్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో ఏఐ చాట్ బాట్ లలో షేర్ చేసుకుంటే మీ డేటాను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.

రహస్యాలు

ఏఐ చాట్ బాట్ లతో మీ రహస్యాలను ఎప్పుడూ పంచుకోవచ్చు. ఎందుకంటే అది వ్యక్తి కాదు, మీ రహస్యాలను తనలో దాచుకోలేదు.

ఆరోగ్య సలహాలు

ఆరోగ్య సలహాల కోసం ఎప్పుడూ ఏఐపై ఆధారపడవద్దు. ఎందుకంటే అది వైద్యుడు కాదు. అలాగే ఆరోగ్య బీమా నంబర్, ఇతర వివరాలను దానిలో షేర్ చేయకండి.

సమాచారం స్టోరేజీ

ఏఐలతో పంచుకున్న అన్ని విషయాలను స్టోర్ అవుతాయి. అలాగే దాన్ని ఇతరులకు పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి తెలియకూడదనుకునే ఏ విషయాన్ని షేర్ చేసుకోవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి