జీవితం ఎప్పుడూ సాఫీగా నడిచిపోదు. కష్టాలు రకరకాలుగా వస్తూనే ఉంటాయి. ఏ కష్టం వచ్చినా ఎదో రకంగా ఎదుర్కుంటూ ముందుకు సాగక తప్పదు. ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే వాటిని ఎదుర్కునే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే, అనారోగ్యాన్ని జయించాలంటే సంకల్ప బలంతో పాటు బోలెడు సొమ్ములూ కావాలి. అందుకే అటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినపుడు ఆర్థికంగా సహాయపడటం కోసం ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. రకరకాల పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. పాలసీని బట్టి డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీల వరకూ ఎన్నో రకాల చికిత్సలకు ఆర్ధికంగా భరోసా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతూ ఉంటే ఆసుపత్రి, ఓపీడీ, అంబులెన్స్ సహా చాలారకాలైన ఖర్చులు ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయి. అంతే కాదు సెక్షన్ 80డీ కింద టాక్స్ ప్రయవజనాలూ ఉంటాయి. మరి ఇన్ని ఉపయోగాలున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రకమైన పాలసీ ఎంచుకోవాలి? ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు.
సాధారణంగా మానందరిలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏదో ఒకోసారి ఉపయోగపడుతుంది కానీ, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకూ దీనివలన ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయం ఉంది. కానీ, ఇది సరికాదు. అత్యవసర సమయాల్లో ఖరీదైన ట్రీట్ మెంట్స్ కోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. కొన్ని పాలసీలు రూపాయి కూడా మనం ఖర్చు చేయకుండా.. ఆసుపత్రి బిల్లు చెల్లించేలా కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒక్కరూ అనారోగ్యం బారిన పడినా మానసికంగా కుటుంబం అంతా విల విల లాడిపోవడం జరుగుతుంది. దీనికి ఆర్ధిక ఇబ్బంది కూడా తోడైతే కుటుంబం అంతా చాలా కష్టాల్లోకి జారిపోతుంది. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా అవసరం.
ఇక ఇటీవల కాలంలో గుండె పోటు.. శ్వాసకు సమబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రి పాలవడం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఆరోగ్య సమస్యలకు ఆసుపత్రి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఖర్చులను భరించి తట్టుకోవడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందే చెప్పినట్టు మన దేశంలో ఎన్నో సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో కూడా చాలా రకాల పాలసీలు ఉంటాయి. ఈ పాలసీలలో ఏది మంచిదో నిర్ధారించుకోవడం ఎలా అనే విషయం తెలుసుకుందాం.
మన దేశంలో 25 శాతం సడన్ డెత్‌లు హార్డ్‌కు సంబంధించిన సమస్యలతోనే జరుగుతున్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, శ్వాస సంబంధిత సమస్యలు.. ఇలా చాలా సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి చికిత్స ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ వ్యాధులు కవర్ అయ్యే పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి ఈ వ్యాధులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నా.. ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వాటికి కూడా కవర్ ఇచ్చే పాలసీ తీసుకోవడం మంచిది. ఈ రకమైన పాలసీలు వెంటనే ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు. కొంత కాలం వెయిటింగ్ పీరియడ్ తో వస్తాయి. అంటే మనం పాలసీ తీసుకున్న తరువాత వ్యాధిని బట్టి.. ఇన్సూరెన్స్ కంపెనీ విధానాన్ని బట్టి.. ఎఏ వేయింగ్ పీరియడ్ ఉంటుంది. అయినా సరే.. ఇటువంటి పాలసీ తీసుకోవాడమే మంచిది.
ఇన్సూరెన్స్ సంస్థలతొ లింక్ అయిన హాస్పిటల్స్ అంటే నెట్ వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. పెద్ద హాస్పిటల్స్, స్పెషలైజేషన్ ఉన్న హాస్పిటల్స్, మనం నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న హాస్పిటల్స్ కలిగివున్న పాలసీ ఎంచుకోవాలి. అలాగే ఈ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న సంస్థ నుంచి ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి.
ఇక ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. సాధారణంగా మన హాస్పటల్స్ దొరికే చికిత్సకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తుంటారు. కానీ, ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా హోమియోపతి, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్ని దీర్ఘ కాళిక వ్యాధులకు వీటిలో కొంత వరకూ చికిత్స దొరుకుటుందనే నమ్మకమూ ఉంది.. చాలా కేసుల్లో ఈ వైద్య విధానాల ద్వారా వ్యాధులు నయం అయినట్టు రికార్డులూ చెబుతున్నాయి. ఆయుర్వేదం, హోమిటివపతి, నేచురోపతి, యునానీ, యోగా వంటి చికిత్స విధానాలను ఆయుష్ గా చెబుతారు. మనం తీసుకునే హెల్త్ పాలసీలో ఎఏ ఆయుష్ లో ఉండే చికిత్సలు కూడా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి.
ఇవే కాకుండా మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే టప్పుడు కచ్చితంగా దానిలోని టెర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నియమ నిబంధనలు అన్నిటినీ చదివి.. అర్ధం చేసుకుని పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే, కంపెనీ ని బట్టి విధానాలుంటాయి. కొన్ని కంపెనీల పాలసీలు మెడీసీన్స్ ఖర్చ్ కవర్ చేయకపోవచ్చు. మారికొన్నిటిలో ఆసుపత్రిలో చెరితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తామనే నిబంధన ఉండవచ్చు. ఒక్కో పాలసీ ఆసుపత్రీ లో అయ్యే అన్ని ఖర్చులనూ పాలసీలో కవర్ చేయకపోవచ్చు. ఏదైనా పాలసీ తీసుకునే ముందు మన అవసరాలు.. మనం ఎంత ప్రీమియం కట్టగలం.. అలాగే కవర్ అయ్యే మొత్తం ఎంత ఇలాంటి అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తరువాత ముందడుగు వేయాలి.
అదండీ విషయం ఇన్సూరెన్స్ అనేది మనకు ఆపద సమయాల్లో ఉపయోయపడేదిగా ఉండాలి. మనం జాగ్రత్తగా పరిశీలించి పాలసీ తీసుకోకపోతే అత్యవసర సమయంలో అది మనకు పనికి రాకపోతే మన ఆర్ధిక పరిస్థితి గందరగోళం అయిపోతుంది. అందుకే ఈ విషయాలన్నీ పరిశీలించి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి