Bank loans: బ్యాంకు లోన్‌ల విషయంలో ఆ తప్పు చేస్తున్నారా..? పాన్ నెంబర్‌తో చూసుకోవాల్సిందే..!

|

Aug 10, 2024 | 7:43 PM

ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వెనుక విద్య, వ్యాపారం, చదువు, స్థిరాస్థి కొనుగోలు, వ్యక్తిగత అవసరాలు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. వాటికి ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. తీసుకున్న రుణంతో పాటు వడ్డీ కూడా దానిలో కలిపి ఉంటుంది. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించడంతో పాటు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా లోన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. మీ పాన్ కార్డును ఉపయోగించి ఈ పని చాలా సులువుగా చేసుకోవచ్చు.

Bank loans: బ్యాంకు లోన్‌ల విషయంలో ఆ తప్పు చేస్తున్నారా..? పాన్ నెంబర్‌తో చూసుకోవాల్సిందే..!
Bank Loan
Follow us on

ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకుంటూ ఉంటారు. వీటి వెనుక విద్య, వ్యాపారం, చదువు, స్థిరాస్థి కొనుగోలు, వ్యక్తిగత అవసరాలు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. వాటికి ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు. తీసుకున్న రుణంతో పాటు వడ్డీ కూడా దానిలో కలిపి ఉంటుంది. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించడంతో పాటు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా లోన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. మీ పాన్ కార్డును ఉపయోగించి ఈ పని చాలా సులువుగా చేసుకోవచ్చు. నేటి కాలంలో రుణాలను పర్యవేక్షించుకోవడం చాలా అవసరం. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాంకు రుణాలు తీసుకున్నప్పుడు పాన్ కార్డు నంబర్ కు నమోదు చేస్తారు. మనం పాన్ కార్డును ఉపయోగించి మన రుణాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు. తద్వారా చెల్లింపులను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. లోన్ విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వెంటనే గుర్తించే అవకాశం కలుగుతుంది. రుణం సక్రమంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ కూడా పెరిగే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకునే విధానం

  • ముందుగా సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరో అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. లేదా మీ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ను ఉపయోగించండి.
  • మీకు ఖాతా లేకుంటే, మీ పాన్ కార్డుతో సహా మీ వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి.
  • లాగిన్ అయిన తర్వాత క్రెడిట్ నివేదికను యాక్సెస్ చేయగల విభాగానికి నావిగేట్ అవ్వండి. దానిలో మీరు తీసుకున్న యాక్టివ్ లోన్ వివరాలు ఉంటాయి.
  • క్రెడిట్ రిపోర్ట్‌ ను పరిశీలించండి. దానిలో లోన్ మొత్తం, కాల వ్యవధి, బాకీ మొత్తం, రీపేమెంట్ తదితర అన్ని వివరాలు కనిపిస్తాయి.
  • లోన్ వివరాలు తెలుసుకోవడం వల్ల మీకు స్పష్టత వస్తుంది. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకునే అవకాశం కలుగుతుంది.

పర్సనల్‌ లోన్ కాలిక్యులేటర్‌

రుణాల నిర్వహణకు వ్యక్తిగత రుణ కాలిక్యులేటర్ చాలా ఉపయోగపడుతుంది. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఈఎంఐ)పై వివిధ వడ్డీ రేట్లు, కాలవ్యవధి తదితర వివరాలను తెలియజేస్తుంది. మీరు మరో రుణం కొత్తగా తీసుకోవాలన్నా, ఇప్పటికే ఉన్న రుణాన్ని రీఫైనాన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నా వ్యక్తిగత రుణ కాలిక్యులేటర్‌
వల్ల ప్రయోజనం కలుగుతుంది.

ఇండస్ఇండ్ బ్యాంకు రుణాలు

వివిధ ఆర్థిక అవసరాలకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఆన్‌లైన్ వ్యక్తిగత రుణం మంజూరు చేస్తుంది. ఎమర్జెన్సీ, విద్య, ఇతర అవసరాల కోసం ఈ బ్యాంక్ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లు అందుబాటులో ఉన్నాయి. సౌకర్యవంతమైన కాలవ్యవధి, అనుకూల వడ్డీ రేట్లతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాంక్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా మీ లోన్ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ రిపోర్ట్

మీ క్రెడిట్ హిస్టరీను వివరించే సమగ్ర పత్రమే క్రెడిట్ రిపోర్ట్. దీనిలో మీరు తీసుకున్న రుణాలు, చెల్లింపు విధానం, క్రెడిట్ కార్టులు తదితర వివరాలు ఉంటాయి. మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా సమీక్షించడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..