Electronics Goods: ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు వీటిని గమనించండి

|

May 20, 2023 | 4:35 PM

వేసవికాలం కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు కూడా AC, ఫ్రిజ్, కూలర్ కొనాలని చూస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు AC, ఫ్రిజ్, కూలర్ మాత్రమే కాదు ఏ రకమైన హోమ్ అప్లయెన్స్ కొనాలని అనుకున్నా..

Electronics Goods: ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు వీటిని గమనించండి
Electronics
Follow us on

వేసవికాలం కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు కూడా AC, ఫ్రిజ్, కూలర్ కొనాలని చూస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు AC, ఫ్రిజ్, కూలర్ మాత్రమే కాదు ఏ రకమైన హోమ్ అప్లయెన్స్ కొనాలని అనుకున్నా.. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

అన్నింటిలో మొదటిది మీరు వాటి ఫీచర్స్‌ను గమనించాలి. తయారీ విధానాన్ని చెక్ చేసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారై ఉండాలి. ఉదాహరణకు, మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తుంటే, దాని సౌండ్ తగినంతగా ఉండాలని కోరుకుంటే, దానిలో డాల్బీ ఆడియో ఉందా లేదా అలాగే స్పీకర్ ఎంత వాట్స్‌ ఉందో చెక్ చేసుకోవాలి. దృష్టి పెట్టవలసిన తదుపరి విషయం ఏమిటంటే.. పరికరం పరిమాణం. మీరు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, AC లేదా మరేదైనా ప్రోడక్ట్‌ను కొనుగోలు చేస్తుంటే మీ కుటుంబం ఎంత పెద్దది, గదులు ఎంత పెద్దవి మొదలైనవాటిని మీరు పరిగణించాలి. ఈ అన్ని అంశాల ఆధారంగా మీ ప్రోడక్ట్‌ సైజ్ నిర్ణయించాలి.

ఇప్పుడు శక్తి సామర్థ్యానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం కానీ, ఇంకేదైనా ప్రోడక్ట్‌ కానీ దాని ఎనర్జీ యూసెజ్ కి సమబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ధృవీకరణతో వచ్చే ఉపకరణాలు ఉంటాయి. BEE గరిష్టంగా 5 స్టార్‌ రేటింగ్‌తో ఉంటుంది. 5-స్టార్ రేటింగ్‌లతో వచ్చే ప్రొడక్ట్స్ తక్కువ మొత్తంలో విద్యుత్‌ వినియోగించుకుంటాయని గుర్తించుకోండి. రేటింగ్ తగ్గినప్పుడు, ప్రొడక్ట్ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ 4 లేదా 5 స్టార్ రేటింగ్‌తో ఉత్పత్తులను కొనుగోలు చేయండి.

ఇవి కూడా చదవండి

వారంటీ, సేవా ప్రణాళికపై శ్రద్ధ చూపడం కూడా చాలా ముఖ్యం. ఇక అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ప్రోడక్ట్‌ వారంటీ. అలాంటి వారంటీ ఉన్న ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయడం ఉత్తమం. వారంటీ లేకుండా కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిందే. దీని వల్ల కొంత నష్టం వాటిల్లుతుంది. వారంటి అనేది నష్టాన్ని, ప్రోడక్ట్‌ను రక్షిస్తుంది. చాలా సార్లు ప్రోడక్ట్‌ తయారీలో లోపాలు గుర్తిస్తే వారంటీ ఉపయోగపడుతుంది.

కొన్ని ప్రోడక్ట్‌లకు ఎయిర్ కండిషనర్లు వంటి సాధారణ నిర్వహణ, సేవ అవసరం. అందుకే మీ ప్రొడక్ట్ కు సమబంధించిన సర్వీస్ ప్లాన్‌కు అర్హత కలిగి ఉందో లేదో మీరు చెక్ చేయాలి.

ఏదైనా ఉపకరణాన్ని కొనుగోలు చేసే ముందు, దాని ఆన్‌లైన్ రివ్యూ చూడండి. సరైన ఉత్పత్తిని ఎంచుకోవడంలో ఈ రివ్యూలు మీకు సహాయపడతాయి. అలాగే, కస్టమర్ మద్దతు, నిపుణుల సలహాపై శ్రద్ధ వహించండి. అద్భుతమైన కస్టమర్ సర్వీస్ కు పేరుపొందిన కంపెనీల నుంచి మాత్రమే ప్రొడక్ట్స్ కొనుక్కోవడం మంచిది.

ఇక చివరగా చెప్పుకుంటున్నా.. చాలా ముఖ్యమైన అంశం వస్తువు ధర ధర. మీ బడ్జెట్‌లో ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయండి. మీ బడ్జెట్‌కు సరిపోయే ఉత్పత్తులలో మీకు కావలసిన ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫీచర్లు, శక్తి సామర్థ్యం, అన్ని ఇతర అవసరమైన విషయాలు మీ అవసరాలను తీర్చేలా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి