AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఏకంగా 8.05శాతం వడ్డీ.. పూర్తి వివరాలు ఇవి..

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ రుణదాత అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కూడా తన వడ్డీ రేట్లను సవరించింది. ముఖ్యంగా తన బ్యాంకులోని ఫిక్స్ డ్ ఖాతాలపై వడ్డీరేట్లను రివైజ్ చేసింది. కొత్త వడ్డీ రేట్లు 2023, మే 18 నుంచి అమలులోకి వచ్చినట్లు పీఎన్బీ అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది.

PNB FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఏకంగా 8.05శాతం వడ్డీ.. పూర్తి వివరాలు ఇవి..
Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: May 20, 2023 | 5:30 PM

ఇటీవల కాలంలో అన్ని బ్యాంకులు తన వడ్డీ రేట్లను సవరించాయి. లోన్లతో పాటు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలపై కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. ఇదే క్రమంలో ప్రముఖ పబ్లిక్ సెక్టార్ రుణదాత అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కూడా తన వడ్డీ రేట్లను సవరించింది. ముఖ్యంగా తన బ్యాంకులోని ఫిక్స్ డ్ ఖాతాలపై వడ్డీరేట్లను రివైజ్ చేసింది. కొత్త వడ్డీ రేట్లు 2023, మే 18 నుంచి అమలులోకి వచ్చినట్లు పీఎన్బీ అధికారిక వెబ్ సైట్లో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 2 కోట్ల లోపు ఉన్న ఎఫ్ డీలపై కొత్త వడ్డీ రేట్లు అరవై ఏళ్ల లోపు ఉన్న సాధారణ ప్రజలకు 444 రోజుల టెన్యూర్ పై 7.25శాతం ఉండగా.. అదే 444 టెన్యూర్ లో ఆరవై ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజెన్స్ కు 8.05శాతం వరకూ ఉంది. అలాగే 666 రోజుల ఎఫ్ డీ పై సాధారణ ప్రజలకు 7.05శాతం వడ్డీ రేటు, అదే 666 రోజుల టెన్యూర్ పై సీనియర్ సిటిజెన్స్ కు 7.55, సూపర్ సీనియర్ సిటిజెన్స్ కు 7.85 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

వడ్డీ రేట్లు ఇలా..

  • 1 7 నుంచి14 రోజుల టెన్యూర్ తో కూడిన ఎఫ్‌డీ పై సాధారణ ప్రజలకు 3.5శాతం, సూపర్ సీనియర్లకు 4శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 4.3 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
  • 15 నుంచి 29 రోజుల టెన్యూర్ తో కూడిన ఎఫ్‌డీ పై సాధారణ ప్రజలకు 3.5శాతం, సీనియర్ సిటిజెన్స్ కు 4శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 4.3శాతం వడ్డీని పీఎన్బీ అందిస్తోంది.
  • 30 నుంచి 45 రోజుల టెన్యూర్ తో కూడిన ఎఫ్‌డీ పై సాధారణ ప్రజలకు 3.5శాతం, సీనియర్ సిటిజెనులకు 4శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 4.3శాతం వడ్డీ రేటును పీఎన్బీ అందిస్తోంది.
  • 46 నుంచి 90 రోజుల టెన్యూర్ తో కూడిన ఎఫ్‌డీ పై సాధారణ ప్రజలకు 4.5శాతం, సీనియర్ సిటిజెనులకు 5శాతం, సూపర్ సీనియర్ సిటీజెనులకు 5.3శాతం వడ్డీని అందిస్తోంది.
  • 91 నుంచి 179 రోజుల టెన్యూర్ తో కూడిన ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 4.5శాతం, సిటీజెనులకు 5శాతం, సీనియర్ సిటిజెనులకు 5.3శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తోంది.
  • 180 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.5శాతం, సీనియర్ సిటిజెనులకు 6శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 6.3శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ టెన్యూర్ తో తీసుకొనే ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 5.8శాతం, సీనియర్ సిటిజెనులకు 6.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 6.6 శాతం వడ్డీ రేటును పీఎన్బీ అందిస్తోంది.
  • 1 సంవత్సరం టెన్యూర్ తో కూడిన ఎఫ్ఢీ పై సాధారణ ప్రజలకు 6.8శాతం, సీనియర్ సిటిజెనులకు 7.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది.
  • 1 సంవత్సరం నుంచి 443 రోజుల కంటే తక్కువ ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై సాధారణ ప్రజలకు 6.8శాతం, సీనియర్ సిటిజెనులకు 7.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.6శాతం వడ్డీ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంకు అందిస్తోంది.
  • 444 రోజుల వ్యవధితో కూడిన ఖాతాలపై సాధారణ ప్రజలకు 7.25శాతం, సీనియర్ సిటిజెనులకు 7.75శాతం, సూపర్ సీనియర్లకు 8.05 శాతం వడ్డీ రేటు వస్తుంది.
  • 445 రోజుల నుంచి 665 రోజుల టెన్యూర్ తో వచ్చే ఎఫ్డీ ఖాతాపై సాధారణ ప్రజలకు 6.8శాతం, సీనియర్ సిటిజెనులకు 7.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.6శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తోంది.
  • 666 రోజులు వ్యవధితో ఖాతా తీసుకునే సాధారణ ప్రజలకు 7.05శాతం, సీనియర్ సిటిజెనులకు 7.55శాతం, సూపర్ సినీయర్ సిటిజెనులకు 7.85శాతం వడ్డీ అందుతుంది.
  • 667 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్డీ పై సాధారణ ప్రజలకు 6.8శాతం, సీనియర్ సిటిజెనులకు 7.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.6శాతం వడ్డీని బ్యాంకు అందిస్తోంది.
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్డీ పై సాధారణ ప్రజలకు 7శాతం, సీనియర్ సిటిజెనులకు 7.5శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.8శాతం వడ్డీ అందుతుంది.
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే ఎఫ్డీ పై సాధారణ ప్రజలకు 6.5శాతం, సీనియర్ సిటిజెనులకు 7శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.3శాతం వడ్డీ వస్తుంది.
  • ఇక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఖాతాలపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.5శాతం, సీనియర్ సిటిజెనులకు 7.3శాతం, సూపర్ సీనియర్ సిటిజెనులకు 7.3శాతం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి