Apple iPod: యాపిల్‌ సంస్థ సంచలన నిర్ణయం.. ఐపాడ్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటన..

యాపిల్‌ ఐపాడ్‌.. సంగీతం, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఇక మనకు ఈ యాపిల్‌ (Apple) ఐపాడ్‌ (Ipod) కనిపించకపోవచ్చు. వీటిలో చివరి వెర్షన్‌ అయిన ‘ఐపాడ్‌ టచ్‌’ (Ipod Touch) తయారీని నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ మంగళవారం ప్రకటించింది...

Apple iPod: యాపిల్‌ సంస్థ సంచలన నిర్ణయం.. ఐపాడ్‌ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటన..
Apple Ipod
Follow us

|

Updated on: May 11, 2022 | 4:46 PM

యాపిల్‌ ఐపాడ్‌.. సంగీతం, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఇక మనకు ఈ యాపిల్‌ (Apple) ఐపాడ్‌ (Ipod) కనిపించకపోవచ్చు. వీటిలో చివరి వెర్షన్‌ అయిన ‘ఐపాడ్‌ టచ్‌’ (Ipod Touch) తయారీని నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్టాక్స్ ముగిసే వరకు విక్రయాలు కొనసాగుతాయని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్‌లోకి ఐపాడ్‌ మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటి వరకు వాక్‌మన్‌, రేడియోలు, కంప్యూటర్లలో మాత్రమే సంగీతం వినగలిగేవారికి కొత్త అనుభూతిని తీసుకొచ్చింది. చేతిలో పట్టుకోగలిగే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరంలో 1000 పాటలనందించి సంగీత ప్రియుల చెవిలో సరిగమలు పలికించింది ఈ ఐపాడ్. కాలక్రమంలో యాపిల్‌ ఈ ఐపాడ్‌ కే ఫోన్‌ ఫీచర్లను జతచేసి ఐఫోన్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా మ్యూజిక్‌ ఫీచర్లకు మాత్రమే పరిమితమైన ఐపాడ్‌కు ఆదరణ తగ్గిపోయింది.

దీంతో 2014 నుంచే ఐపాడ్‌ల తయారీకి యాపిల్‌ ప్రాధాన్యం తగ్గించింది. ఆ ఏడాదే ఐపాడ్‌ క్లాసిక్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. 2017లో ఐపాడ్‌ నానో, ఐపాడ్‌ షఫిల్‌ను కూడా తయారీ నుంచి తొలగించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపాడ్‌ టచ్‌ను ఫోన్‌ ఫీచర్లు లేని ఐఫోన్‌గా అభివర్ణిస్తుంటారు. అలాగే ఐఫోన్‌ చీపర్‌ వెర్షన్‌గానూ పేర్కొంటుంటారు. యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ తొలిసారి మార్కెట్‌కు పరిచయం చేసిన ఈ ఐపాడ్‌ ఒకరకంగా చెప్పాలంటే ఆ కంపెనీ చరిత్రను తిరగరాసింది. దాదాపు దివాలా దశకు చేరుకున్న సంస్థలో ఆర్థిక జవసత్వాలు నింపి ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారి మూడు ట్రిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న కంపెనీగా నిలిపింది.

Read Also.. Cryptocurrency: పెరిగిన బిట్‌కాయిన్, ఎథెరియం ధరలు.. 156.47 బిలియన్‌ డాలర్లకు చేరిన క్రిప్టో మార్కెట్‌ పరిమాణం..