Apple: మన దేశంలో రిటైల్ స్టోర్ ప్రారంభించనున్న యాపిల్..  ఆ నగరాల్లో ఇప్పటికే పూర్తయిన ఉద్యోగుల నియామకం!

మన దేశంలో తన సేవలను మరింత విస్తరించేందుకు యాపిల్ ప్రణాళిక చేస్తోంది. ఈ నేపథ్యంలోనే యాపిల్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్  కూడా ధ్రువీకరించారు.

Apple: మన దేశంలో రిటైల్ స్టోర్ ప్రారంభించనున్న యాపిల్..  ఆ నగరాల్లో ఇప్పటికే పూర్తయిన ఉద్యోగుల నియామకం!
Apple Store

Updated on: Feb 04, 2023 | 5:20 PM

యాపిల్ అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న బ్రాండ్. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా తన మార్కెట్ ను పెంచుకుంటోంది. గత నాలుగైదు ఏళ్లలో భారతీయ మార్కెట్ యాపిల్ సంస్థకు కీలకంగా మారింది. ఈ క్రమంలో మన దేశంలో తన సేవలను మరింత విస్తరించేందుకు యాపిల్ ప్రణాళిక చేస్తోంది. ఈ నేపథ్యంలోనే యాపిల్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్  కూడా ధ్రువీకరించారు. ఇండియాలో తమ మొదటి స్టోర్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇటీవల త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ల తో సమావేశం సందర్భంగా, భారతదేశంలో ఆపిల్ ఎలా పని చేస్తుందన్న విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కుక్ త్వరలోనే ఇండియాలో తమ రిటైల్ స్టోర్ ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. అయితే వారి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. దీంతో ఈ విషయంపై క్లారిటీ లేదు.

ముంబై, న్యూఢిల్లీలో యాపిల్ స్టోర్లు ?

యాపిల్ భారతదేశంలో న్యూ ఢిల్లీ, ముంబైలలో రెండు స్టోర్లను ప్రారంభించనుందని కొంతకాలంగా మార్కెట్లో వర్గాల్లో చర్చ ఉంది. దీనిలో ముంబైలోని యాపిల్ స్టోర్ “ఫ్లాగ్‌షిప్” స్టోర్ అవుతుందని ఊహాగానాలున్నాయి. అలాగే న్యూ ఢిల్లీలో మరో చిన్న స్టోర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అంచనావేస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి భారత దేశంలో యాపిల్ విక్రయాలు అధికమయ్యాయని ఆ కంపెనీ సీఈఓ చెప్పారు. ఆన్ లైన్ విక్రయాలు గణనీయంగా ఉండటంతో తమ ఆఫ్ లైన్ స్టోర్ ని ప్రారంభించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగుల నియామకం!

యాపిల్ గత కొన్ని నెలలుగా భారతదేశంలో తన రిటైల్ విభాగానికి సంబంధించిన రిక్రూట్ మెంట్ కూడా ప్రారంభించింది. అనేక పొజిషన్లలో ఉద్యోగాలు కల్పిస్తోంది. ప్రస్తుతం చేపడుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ బట్టి భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ స్టోర్ లు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్-19 యాపిల్ కు భారతదేశంలో మార్కెట్ పై ఒక అంచనాను ఇచ్చింది. ఈ క్రమంలో భారతదేశంలో Apple ఆన్‌లైన్ స్టోర్ 2020లో ప్రారంభించింంది. ఇక ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్ కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కంపెనీతో పాటు, వినియోగదారులకు నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది. ఫలితంగా ఇండియాలో తమ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని ఊహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..