ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు అందరినీ ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా పూణేకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇవూమీ ఎస్1 లైట్ పేరుతో నయా ఈవీను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 84,999(ఎక్స్-షోరూమ్). ముఖ్యంగా ఈ స్కూటర్ కొనుగోలుపై ఇవూమీ కంపెనీ మూడు సంవత్సరాల బ్యాటరీ వారెంటీని అందిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి కీలక ప్రాంతాల్లోని డీలర్‌షిప్‌లలో ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్‌లను లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవూమి ఎస్1 లైట్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఇవూమీ ఎస్ 1 లైట్ స్కూటర్ 60 వీ 52 ఏహెచ్ లయన్ బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిమీల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ 1.2 కేడబల్ల్యూ పవర్, 10.1 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవూమీ ఎస్1 లైట్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 53 కిలోమీటర్లుగా ఉంది. అంతేకాకుండా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ కాయిల్ యూనిట్ ఆకర్షిస్తుంది. ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకింగ్ సెటప్ నుండి స్థాపింగ్ పవర్ వస్తుంది
ఇవూమీ ఎస్1 లైట్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ప్రాక్టికాలిటీ విషయానికొస్తే స్కూటర్ 18 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 150 కిలోల వరకు మోసుకెళ్లే సామర్థ్యంతో వస్తుంది. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ ఎల్ఈడీ డిస్ప్లే ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఎల్ఈడీ డిస్‌ప్లే కావాలంటే అదనంగా రూ. 4,999 చెల్లించాల్సి ఉంటుంది. డీటీఈ ఇండికేటర్, టర్న్-బై- టర్న్ నావిగేషన్‌తో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఎస్ఎంఎస్/కాల్ అలర్ట్లు వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా ప్రయాణించే సమయంలో స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..